29.7 C
Hyderabad
April 29, 2024 09: 34 AM
Slider ప్రపంచం

పాకిస్తాన్ ప్రధానికి సుప్రీంకోర్టు నోటీసులు

#ImranKhan

అధికార పార్టీ అనుబంధ సంస్థ అయిన ఇన్ సాఫ్ లాయర్స్ ఫోరం (ఐఎల్ఎఫ్) సదస్సుకు హాజరైనందుకు పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు నోటీసులు జారీ చేసింది.

గత వారం ఇస్లామాబాద్ లో నిర్వహించిన ఐఎల్ఎఫ్ సదస్సుకు ఇమ్రాన్ ఖాన్ హాజరయ్యారు. అధికార పిటిఐ పార్టీకి అధ్యక్షుడైన ఇమ్రాన్ ఖాన్ తన పార్టీకి చెందిన లాయర్ల సదస్సుకు హాజరు కావడం వల్ల మిగిలిన లాయర్లలో అపోహలు తలెత్తే అవకాశం ఉందని పాకిస్తాన్ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ప్రధాని హోదాలో కాకుండా ఆయన తన వ్యక్తిగత హోదాలో ఈ సమావేశానికి హాజరయ్యారని అటార్నీ జనరల్ ఇచ్చిన వివరణను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఖాజీ ఫయేజ్ ఇసా పట్టించుకోలేదు.

పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి ఈ కేసు విచారణకు ఫుల్ బెంచ్ నియమించాలని కూడా ఆయన కోరారు. పంజాబ్ అడ్వకేట్ జనరల్ కు, అటార్నీ జనరల్ కు కూడా న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. ఈ సమావేశంలో పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన వ్యాఖ్యానాలను పాక్ ప్రధాని చేశారు.

Related posts

షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలేరు

Satyam NEWS

శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న పర్యాటక మంత్రి

Satyam NEWS

కరోనా సోకిన వృద్ధురాలు అంబులెన్స్ చూసి ఆకస్మిక మృతి

Satyam NEWS

Leave a Comment