31.7 C
Hyderabad
May 2, 2024 09: 55 AM
Slider విజయనగరం

పోలీసు బాస్ లు మారినా….సిబ్బంది లో చెక్కు చెదరని సేవాధృక్పధం

#depikapatilips

విజయనగరం జిల్లా కు నాలుగు నెలల క్రితం… పోలీసు బాస్ కు పదోన్నతి పై బదిలీ కావడంతో ఆ పదవిలో కొత్త పోలీసు బాస్ దీపికా వచ్చినా….శాఖా సిబ్బంది లో ఉన్న సేవాధృక్పధం… ఆపదలో ఆదుకునే నైజం… సడలలేదు. పాత ఎస్పీ ఉన్నప్పుడు కొత్తవలస ,గజపతినగరం, గుర్ల పీఎస్ పరిథులలో సంబంధిత ఎస్ఐ లు చేసిన సేవలకు ఏకంగా అటు జిల్లా శాఖ తో పాటు ఎస్పీ కనబరచిన సేవలు  జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది.

కొత్త పోలీసు బాస్ వచ్చిన.. కింద స్థాయి పోలీసు సిబ్బంది లో మరింత గా సేవాధృక్పధం కానవస్తోంది. తాజాగా జిల్లాలోని గరుగుబిల్లి పీఎస్ కు చెందిన లేడీ కానిస్టేబుల్… ఓ విద్యార్థిని ప్రాణాలు కాపాడి..మరో సారి శభాష్ పోలీస్ అనిపించుకునేలా వ్యవహరించిందా…కానిస్టేబుల్. వివరాల్లోకి వెళితే…. జిల్లాలోని గరుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్వాయరులో దూకి, ఆత్మహత్యాయత్నం చేసుకోబోయిన విద్యార్థినిని రక్షించిన మహిళా కానిస్టేబుల్ ను జిల్లా ఎస్పీ  దీపిక  జిల్లా పోలీసు కార్యాలయంలో అభినందించి, ప్రశంసా పత్రంను అందజేసారు.

దిశా బీట్ డ్యూటీ నిమిత్తం గరుగుబిల్లి ఎస్ఐ సింహాచలం మహిళా కాని స్టేబులు డి.మంగమ్మను తోటపల్లి పరిసర గ్రామాలకు పంపారు. ప్రజలకు దిశా యాప్ పట్ల అవగాహన కల్పించి, తోటపల్లి రిజర్వాయరు వద్దకు చేరుకున్న మహిళా కానిస్టేబులు డి. మంగమ్మకు అక్కడ అనుమానస్పదంగా సంచరిస్తూ ఒక విద్యార్ధిని కనిపించింది. విషయం తెలుసుకొనే ప్రయత్నం చేయబోగా, ఆ విద్యార్థిని రిజర్వాయరులో దూకేందుకు ప్రయత్నించగా, ఆమెను అడ్డుకొని, సమాచారాన్ని ఎస్ఐ సింహాచలంకు అందించారు.

అనంతరం, ఎస్ఐ సింహాచలం మరియు ఇతర పోలీసు సిబ్బంది రిజర్వాయరు వద్దకు చేరుకొని, ఆమెకు కౌన్సిలింగు నిర్వహించి, వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మీడియాలో వచ్చిన వార్తతో విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ దీపిక మహిళా కానిస్టేబులు మంగమ్మను, అదే రోజు నిర్వహించిన సెట్ కాన్ఫరెన్సులో అభినందించారు. ఈ మేరకు ఎస్పీ..జిల్లా పోలీసు కార్యాలయంకు పిలిపించి మరోసారి మహిళా కానిస్టేబులు డి.మంగమ్మను సంఘటన గురించి అడిగి తెలుసుకొని, ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాన్ని అందజేసారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్

Related posts

జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన సాయి కిషోర్ కి సన్మానం

Satyam NEWS

ఉప్పల్ లో JEET క్రికెట్ అకాడమీ ప్రారంభం

Satyam NEWS

విద్యార్థుల కాళ్లు కట్టేసి..హెడ్‌మాస్టర్ దాష్టీకం…

Satyam NEWS

Leave a Comment