38.2 C
Hyderabad
April 29, 2024 21: 59 PM
Slider ముఖ్యంశాలు

మానవతా దృక్పథంతో పోయే ప్రాణాన్ని రక్షించారు

#kollapur

కొద్దిగా ఆలస్యం అయింటే  ప్రాణం పోయేది. ఊరు తెలియదు, పేరు తెలియదు. కానీ  ఆపద ఉంది  నుండి కొద్దిగా అండగా ఉండండి అని ఒక సమాచారం ఇచ్చారు. అంతే అరక్షణం ఆలోచించకుండా మానవ దృక్పథంతో అక్కడికి చేరుకున్నారు. వారికి అండగా నిలిచారు పొయ్యే ప్రాణాన్ని కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం, చిన్నంబావి మండలం, పెద్ద మారు ఆ గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు లేని  యువతికి సమస్యలు ఏమి వచ్చాయో, కారణం ఏంటో   తెలియదు కానీ పాయిజన్ తీసుకున్నది.

అయితే ఆ యువతికి 70 ఏళ్ల వృద్ధురాలు మాత్రమే తోడుగా ఉన్నది. ఏమిచేయాలో తెలియక గ్రామం వారి సహాయంతో ఎలాగోలాగా కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే పరిస్థితి సీరియస్ గా ఉన్నది. నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించాల్సి  ఉన్నది. అయితే ఆ సమయంలో అంబులెన్స్ లు అందుబాటులో లేవు. దీనితో వారు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఆ విషయాని, వారి పరిస్థితిని ఆ గ్రామానికి చెందిన కొందరు కొల్లాపూర్ రిపోర్టర్ అవుట రాజశేఖర్ కు సమాచారం ఇచ్చారు.

వెంటనే తన వాట్సాప్ అప్డేట్ గ్రూప్ లో పోస్ట్ పెట్టీ ప్రజలకు తెలియచేశారు. అంతే కాదు పట్టణంలో సామాజిక బాధ్యత కలిగిన టిఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఉరి హరికృష్ణ కు వారి పరిస్థితి గురించి సమాచారం ఇవ్వడంతో ఆయన అర క్షణం ఆలోచించకుండా తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు.స్థానిక వైద్యుడు జయ చంద్ర యాదవ్ కు సమాచారం ఇవ్వడంతో ఆ యువతికి వైద్యం అందించి ఆపద నుండి రక్షించారు. అంతవరకే పక్క మండంలంలో ఉన్న అంబులెన్స్ కు కొల్లాపూర్ ఆస్పత్రికి ఉరి హరికృష్ణ తెప్పించారు.

ఆ యువతిని దగ్గరుండి అంబులెన్స్ లో  ఎక్కించి  ఆ వృద్ధురాలి చేతికి వైద్య ఖర్చులకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దీనితో వారిని నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ అంశాన్ని సోషల్ మీడియాలో తెలియజేసే వరకు ఉరి  హరికృష్ణ ను సోషల్ మీడియాలో  ప్రజలు పెద్ద ఎత్తున అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి క్షేమంగా ఉందని  వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. మొత్తానికి ఎవ్వరికైనా సామాజిక బాధ్యత ఉంటే ఒక ప్రాణాన్ని కాపాడవచ్చనీ ఇందుకు సహకరించిన వారు నిరూపించారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు

Satyam NEWS

తెలంగాణ పథకాలు దేశమంతా: కేసీఆర్

Satyam NEWS

ముళ్లు గుచ్చుకుంటున్నయ్..అయినా అందులోనే ఉంటా

Sub Editor 2

Leave a Comment