37.2 C
Hyderabad
May 2, 2024 13: 52 PM
Slider హైదరాబాద్

సొంత ఇల్లు లేకపోతే చనిపోయిన వారికీ కష్టాలే

#AlwinDivisionCorporetor

ఓ పెద్ద మనిషి అనారోగ్యం తో మృతి చెందితే… మృతదేహాన్ని ఇంటికి తీసుకురావాల్సివుండగా… నేరుగా శ్మశాన వాటికకు తరలించారు. అదేంటి బందువులంతా ఇంటి దగ్గర వేచిచూస్తుంటే… మృతదేహాన్ని మాత్రం శ్మశాన వాటికకు తరలించారు.

అందరూ ఆవేదన చెందారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతంలోని అల్విన్ కాలనీ కి చెందిన తృప్తి భూపతి(70)కి అయిదుగురు కుమార్తెలు అయితే సొంత ఇల్లు లేదు. కిరాయి ఇంట్లోనే గత కొన్నేళ్లుగా ఉంటున్నారు. భూపతి అనారోగ్యంతో ఇటీవలే ఆసుపత్రిలో చేరారు.

చికిత్స పొందుతూనే మృతి చెందాడు. దాంతో ఇంటి యజమాని మృతదేహాన్ని తీసుకురావద్జని, ఇంటికి తాళం వేసుకోవడంతో, గత్యంతరంలేక, శ్మశాన వాటికకు తరలించారు. విషయం తెలుసుకున్న ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.

వెంటనే తన బాధ్యతగా అంత్యక్రియల ఖర్చులకోసం పదివేల రూపాయలను భూపతి భార్య విజయలక్ష్మికి అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. దాంతో పాటు దిన ఖర్మల ఖర్చులు సైతం తానే భరిస్తానని హామీ ఇచ్చి ఆపన్న హస్తాన్ని అందించారు.

ఇంటి యజమానులు ఇక ముందు మానవత్వం లేకుండా ప్రవర్తించవద్దని దొడ్ల వెంకటేష్ గౌడ్ కోరారు. ఇలాంటి సంఘటనలు ఎవరికైనా ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

Related posts

విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్‌ను ప్ర‌త్యేకంగా అభినందించిన మంత్రి బొత్స

Satyam NEWS

Phone Taping: సర్వీస్ ప్రొవైడర్ లకు నోటీసులు జారీ

Satyam NEWS

వాయిస్ అఫ్ హైదరాబాద్ పోస్టర్ విడుదల

Satyam NEWS

Leave a Comment