30.7 C
Hyderabad
April 29, 2024 03: 32 AM
Slider నల్గొండ

రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలి

#HujurnagarCongress

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటులో రైతులకు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలనే  నినాదంతో హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు బిల్లులకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు.

 సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం, హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డు మాధవరాయనిగూడెం లో నేడు సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు, పార్టీ సీనియర్ నాయకుడు సాముల శివారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రెటరీ ఎండి అజీజ్ పాషా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి దేశానికి వెన్నెముఖగా భావించే  రైతుల నడ్డివిరిచే విధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం  రైతులకు వ్యతిరేకంగా పని చేస్తుందని, పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వాలు రైతులను రాజుగా చేసే విధంగా ఉండాలి కానీ, రైతుల వ్యతిరేకంగా ఉండకూడదని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో  కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య, మోదాల సైదులు,

 వెలిదండ వీరారెడ్డి, మేళ్లచెరువు ముక్కంటి, బెంజిమెన్, దొంతగాని జగన్, చప్పిడి సావిత్రి, మోదాల వెంకటమ్మ, మేకల సైదులు, మోదాల వెంకన్న, కస్తాల ముత్తయ్య, పాలకూరి లాలు,

అజ్మతుల్లా, ఉద్దండుడు, బెల్లంకొండ రాజా, మహిళా రైతులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

టీఎన్ఎస్ఎఫ్ నేతల ముందస్తు అరెస్ట్ అప్రజాస్వామికం

Satyam NEWS

నడిగడ్డలో కల్తీకల్లు వ్యాపారం చేసిన అరుణ కుటుంబం

Satyam NEWS

కరోనా ఎలర్ట్: గచ్చిబౌలి లో మరో క్వారంటైన్ సెంటర్

Satyam NEWS

Leave a Comment