38.2 C
Hyderabad
April 29, 2024 19: 39 PM
Slider ప్రత్యేకం

వాయిస్ అఫ్ హైదరాబాద్ పోస్టర్ విడుదల

#cbitposter

చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( సిబిఐటి) లో చైతన్య స్పందన క్లబ్, చైతన్య గీతి క్లబ్ సభ్యులు సామాజిక సేవా కార్యకలాపాల నిమిత్తం నిధులను సేకరించాలని నిర్ణయించారు. నిధుల సేకరణ  కోసం రేపటి నుంచి వచ్చే నెల 18 వరకు వాయిస్ ఆఫ్ హైదరాబాద్ అనే కార్యక్రమం చెప్పట్టనున్నట్లు విద్యార్థి వ్యవహారాల జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె జగన్నాధ రావు తెలిపారు. ప్రొఫెసర్ కే జగన్నాధ రావు మాట్లాడుతూ పదాలు విఫలమైనప్పుడు, సంగీతం మాట్లాడుతుంది. సంగీతం అన్ని రకాల వ్యక్తులను కలుపుతుంది.

పదాలు చేయలేని సందేశాన్ని వ్యాప్తి చేస్తుంది.  ప్రతిభను వెలికితీసేందుకు వేదిక వాయిస్ ఆఫ్ హైదరాబాద్ కు సంగీతకారులందరినీ ఆహ్వానిస్తున్నారు అని చెప్పారు.   చైతన్య స్పందన క్లబ్ అధ్యాపక సమన్వయకర్త  డాక్టర్ ఎ వాణి మాట్లాడుతూ మొదటి రౌండ్ లో  ఆన్‌లైన్ ద్వారా 3 మార్చి 2023 లోపు  పాట ను  3 నిమిషాల క్లిప్‌ను అప్‌లోడ్ చేయవచ్చు. ఎంచుకున్న పాట  శైలి/భాషపై ఎటువంటి పరిమితి లేదు.

మార్చి 11, 12 నాడు ఆఫ్‌లైన్ లో జరిగే రెండవ రౌండ్ లో   మొదటి రౌండ్లో   గెలిచిన వారు  పాల్గొనవచ్చు. చివరి రౌండ్  లో రెండవ రౌండ్ షార్ట్-లిస్ట్ చేయబడిన వారు 18 మార్చి 2023న  సిబిఐటి క్యాంపస్ లో  చివరి ప్రదర్శనను నిర్వహించి, అదే రోజున విజేతలుకు బహుమతులు అందిస్తామని చెప్పారు. 

ఈ క్లబ్ సభ్యులు ఈ  కార్యక్రమం ద్వారా వచ్చే నిధులను విద్య, పర్యావరణం, ఆరోగ్య పరిశుభ్రత మరియు శ్రేయస్సు, సామాజిక బాధ్యతలు, స్థిరమైన గ్రామీణాభివృద్ధి కోసం ఖర్చు చేస్తారని చైతన్య గీతి క్లబ్ అధ్యాపక సమన్వయకర్త  నటరాజు తెలిపారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ పి కౌస్తుభ, స్టూడెంట్ కోఆర్డినేటర్ సాత్విక్ రెడ్డి ఇతర విద్యార్థులు పాల్గొన్నారు.  మరిన్ని వివరాల కోసం కళాశాల వెబ్ సైట్ www.cbit.ac.in ని సందర్శించవచ్చు అని కళాశాల పి  ఆర్ ఓ డాక్టర్ జి ఎన్ ఆర్ ప్రసాద్ తెలిపారు.

Related posts

ఓ పోరాట యోధుని విజయం

Satyam NEWS

మున్సిపల్ కార్మికుల పై కక్ష సాధింపు ఎందుకు?

Bhavani

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన యాంకర్ సుమ

Satyam NEWS

Leave a Comment