38.2 C
Hyderabad
May 2, 2024 21: 49 PM
Slider గుంటూరు

కోటప్పకొండ ఆదాయం రూ. 1.73కోట్లు

#kotappakonda

రాష్ట్రంలోని ప్రముఖ శైవ  పుణ్యక్షేత్రమైన కోటప్పకొండలో స్వయంభువుగా వెలిసియున్న శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానములో శ్రీ మహాశివరాత్రి సందర్బంగా మొత్తం రు.1,73,67,389-00 లు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి తెలిపారు.

వివిధ రకాల పూజ టిక్కెట్ల ద్వారా రు.65,01,240 లు, ప్రసాదముల అమ్మకము ద్వారా 35,00,025 లు, అన్నదానం పథకమునకు రు.1,21,321 లు, హుండీల ద్వారా రు.72,44,803 లు వచ్చినట్లు ఆయన తెలిపారు. దేవస్థానం వద్ద  హుండీలు లెక్కింపు  కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమములో మహాశివరాత్రి తిరునాళ్ళ ఉత్సవ అధికారి దేవాదాయశాఖ అదనపు కమిషనరు పి.చంద్రకుమార్ , ఉప కమిషనర్  ఈమని చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎండోమెంట్స్ అధికారి సత్యనారాయణ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి‌  వేమూరి గోపి ఆధ్వర్యములో  హుండీ లెక్కింపు జరిగినది.  

హుండీల ద్వారా రూ.72,44,803/-  వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి తెలిపారు. గత సంవత్సరం ఆదాయంతో పోల్చగా ప్రస్తుతము రూ.4,30,519/- లు అదనముగా వచ్చినట్లు, బంగారం 1 గ్రాము 950 మిల్లీ గ్రాములు, వెండి 367  గ్రాములు వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమములో ఇస్సపాలెం మహంకాళి అమ్మవారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సుధాకర్ రెడ్డి, మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు  ముక్కు వెంకటేశ్వరరెడ్డి, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, యల్లమంద బ్రాంచ్ మేనేజరు ఏ.యస్.ఎన్.రసూల్ బ్యాంక్ సిబ్బంది,  ఆలయ సిబ్బంది, శ్రీ భ్రమరాంబికా సేవా సమితి, చీరాల, శ్రీ సద్గురు సేవా సమితి, నరసరావుపేట సేవక బృందాలు పాల్గొన్నారు.

Related posts

యువకుడి మృతిపై సందేహాలు ఉంటే చెప్పండి

Bhavani

ఖాకీల అదుపు లో గంజాయి స్మగ్లర్లు…!

Satyam NEWS

భారీ ఉగ్రకుట్ర భగ్నం :ముగ్గురు ఐసిస్​ ముష్కరుల అరెస్ట్​

Satyam NEWS

Leave a Comment