29.7 C
Hyderabad
April 29, 2024 08: 35 AM
Slider వరంగల్

ఎంతటి వారికైనా విద్యాబుద్ధులు నేర్పేది గురువే

#anitareddy

జాతీయ వినియోగదారుల సంఘం తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్, అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి అద్యక్షతన హనుమకొండ లోని సృందన మానసిక మనోవికాస కేంద్రం లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురుపూజ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిధిగా ఫాదర్ జొరుమ్ విచ్చేసారు. జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ఉపాధ్యాయులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిసి శాలువా మరియు బహుమతులతో ఘనంగా సన్మానించారు. పిల్లలలు పాటలు పాడి డాన్స్ లు చేసి అలరించారు. ఈ సందర్భంగా అనితా రెడ్డి మాట్లాడుతూ గురువుకు ఉండే స్థానం మరెవరికి ఉండదని అది అందరి కంటే ప్రత్యేక స్థానం అని అన్నారు.

సాధారణ పిల్లలను తీర్చిదిద్దే టీచర్స్ కి మానసిక దివ్యాంగుల పిల్లలను తీర్చిదిద్దే టీచర్స్ కి ఎంతో తేడా ఉంటుందని వీరు ఎంతో ప్రేమ, ఓర్పు తో సహనంతో పిల్లలకు ప్రతి ది నేర్చించాల్సి ఉంటుందని అలాంటి టీచర్స్ ని సన్మానించడం అంటే మన సంస్కారానికి నిదర్శనం అని అన్నారు. డాక్టర్, లాయర్, ముఖ్య మంత్రి, ప్రదాన మంత్రి ఇలా ఎవరు ఏ స్తాయిలో ఉన్నా ఒకప్పుడు ఓ గురువుకు శిష్యులేనని అన్నారు. గురువులు చెప్పిన మంచి ని గ్రహించి ఆచరించి న వారి జీవితాలు ఎప్పుడుా ఉన్నతమైనవి గానే ఉంటాయి అని అనితా రెడ్డి అన్నారు. ఫాదర్ జొరూమ్ మాట్లాడుతుా ఎంతో సహనంతో ఈ పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పు తున్న టీచర్స్ కి ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఉంటాయని, తన సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. రాజేందర్ రెడ్డి, సుచరిత, వసుధ ,హరిత కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలకు మిఠాయిలును అందించారు.

Related posts

గిరిజనులకు అండగా నిలిచేందుకు మెగా వైద్య శిబిరం

Satyam NEWS

కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎంపికైన ‘‘బికినీ భామ’’

Satyam NEWS

ఆస్ట్రేలియాలో అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

Satyam NEWS

Leave a Comment