41.2 C
Hyderabad
May 4, 2024 15: 07 PM
Slider ఆదిలాబాద్

వర్షాలతో ప్రజలు చనిపోతుంటే కెసిఆర్ మాత్రం ప్రగతి భవన్ దాటరు

#RS Praveen Kumar

రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలకు వరదల్లో చిక్కి ప్రజలు చనిపోతుంటే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మండి పడ్డారు. కాగజ్ నగర్ పట్టణంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం ఆదేశాలు లేనిదే మంత్రులు, అధికార యంత్రాంగం బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు.

వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ములుగు, ఏటూరు నాగారం, వరంగల్ ప్రాంతాల్లో వరదలతో సర్వం కోల్పోయిన కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సహాయం ప్రకటించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. గతేడాది గోదావరి కరకట్టలకు రూ.వేయి కోట్ల కేటాయిస్తారని ప్రగల్బాలు పలికిన సీఎం, రూ.కోటి కూడా కేటాయించ లేదన్నారు. గోదావరి వరదల్లో ప్రజలు చనిపోతుంటే కేసీఆర్ ఎక్కడని ప్రశ్నించారు.

కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే రూ.1,400 కోట్లతో కొత్త సెక్రటేరియేట్ నిర్మించుకున్నారని, ఆయన మారుమూల ప్రాంతాల్లో రోడ్లు నిర్మించలేదన్నారు.సీఎం ప్రత్యేక నిధులు రూ.వేయి కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. దళిత బంధు, చేతి, కుల వృత్తుల బంధు ప్రకటించి సీఎం కేసీఆర్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో రాజకీయ నాయకులు, మీడియాను అనుమతించొద్దని ప్రభుత్వం నోటీసు ఇవ్వడం సీఎం కేసీఆర్ చేతకానితనంగా పేర్కొన్నారు. మణిపూర్ లో జరిగిన మరణ హోమంపై ప్రధాని మౌనంగా ఉండడం దేనికి సాంకేతమన్నారు. బీజేపీ పాలనలో మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆదివాసులు, ఎస్సీ, మైనారిటీలపై దాడులు జరుగుతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫాసిస్ట్ బీజేపీని ఓడించి, దేశం నుండి బయటకు పంపించాలన్నారు.

బెజ్జూరు ఒర్రె బ్రిడ్జి నిర్మించి అప్రోచ్ రోడ్డు నిర్మించకపోవడంతో గ్రామాలకు వెళ్లాలంటే ప్రజలు అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దిందా వాగుపై వంతెన నిర్మించకపోవడంతో పాఠశాలకు వెళ్లలేదని టీచర్లు చెబితే ఎమ్మెల్యే ఒత్తిడితో కలెక్టర్ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్ చేయడం సిగ్గుచేటన్నారు. మిషన్ భగీరథకు రూ.36 వేల కోట్లు కేటాయించినా బెజ్జూర్ ప్రాంతంలో తాగునీరు కోసం వాగు చెలిమల్లో నీళ్లు తోడుకునే దుస్థితి ఉందన్నారు.

ప్రాజెక్టులకు మరమ్మతులు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. ఎమ్మెల్యే కోనప్ప అండతో బెజ్జూర్ ఇంచార్జ్ సర్పంచ్ పంచాయతీలో రూ.6 లక్షల అభివృద్ధి పనులు చేసి, రూ.12 లక్షల నిధులు డ్రా చేశారని ఆరోపించారు.

నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఇంచార్జ్ సర్పంచ్, అవినీతి, అక్రమాలకు సహకరించిన పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కోనప్ప అక్రమాలు, అవినీతిపై త్వరలోనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదు చేయనున్నట్లుఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి, నియోజకవర్గ ఇంచార్జి అర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కని సంజయ్, జిల్లా అధ్యక్షుడు మొర్లె గణేష్, నవీన్, కాగజనగర్ మండలాధ్యక్షుడు అరుణ్, పట్టణాధ్యక్షుడు మనోహర్, నియోజకవర్గ అధ్యక్షుడు రాంప్రసాద్, మహిళా అధ్యక్షురాలు విజయ నిర్మల, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఒకటో తేదీ

Satyam NEWS

ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాలి

Bhavani

ఇదీ మన సంస్కారానికి నిదర్శనం

Satyam NEWS

Leave a Comment