26.7 C
Hyderabad
April 27, 2024 10: 28 AM
Slider కవి ప్రపంచం

ఒకటో తేదీ

#Kondapally Niharini

నిన్న మొన్నటి చేదు అనుభవాలు,

రేపటి విపరీతాలు! జీవనాదం పై నాదైన తత్వసీమ నుండి పరిచయమిది !

బాలెన్స్ డ్ గా కేలండర్ లో నువ్వు రోజులను ఈడుస్తున్నట్టు  లోకానికి తెలిసేద నా  గమనికలోనే  !

కొన్ని నవ్వుతూనో, కొన్ని ఏడుస్తూనో మరుపు కుప్పల్లో జ్ఞాపకాల్ని కూర్చేసినవు.

నెలనెల నా రూపును చూసి,

నా నడకకు వేచి, నువ్వు గిరికీలుకొడుతూనో, నన్ను గిరివీపెడుతూనో నీ బతుకుతెల్లారుస్తుంటావని  తెలుసు.

స్వార్థ ఊహలు నీ ఊడుపులై, అధికారదాహం నీ ఆసనమై,

తొందరపాటో, ఏమరుపాటో నీదైన శైలియై నా, నా కంటిముందు ఏవగింపు తెరపై కృతక నృత్యం చేస్తూనే కరాళ నృత్యమని కాలాన్ని నిందిస్తుంటావు.

కానరాని క్రిమియేదో నిష్కర్ష నిర్ణయాల్తో నిన్ను వివేచనలో పడవేస్తే, ఇంటికేపరిమిత చిత్రానివయ్యావు. పాషాణసదృశమనీ, విషవలయమనీ ఇంకేవో విశేషణాలన్నీ కరోనా మీద వేసి నీలోని అసలును బొమ్మకట్టించావు.

అన్నింటికీ అతి ఆడంబరాలక్కరలేదని,

విచ్చలవిడితనానికి కనలేని కళ్ళాన్నేసింది.

సంపాదనల పరుగులో సంసారాన్ని మైదానం బంతిని చెయొద్దని తెలిపింది.

పరిశుభ్రత ఒంటికేకాదు మంటికిచేరేవరకూ మనసుకవసరమని నేర్పింది ఇరవై ఇరవై.

పాఠాలెన్నివిన్నా పాటించని జనులమధ్య అంటువ్యాధుల్లా ఇటువంటివెన్నో ఉంటాయి, తస్మాత్ జాగ్రత్తని తెలిపిన పాతయేడుకు అంతర్గతనమస్సులు సమర్పిస్తూనే,

గెలుపు భావనొకటి భుజాన వేసుకొని,

అంతా మంచే జరగాలని,

తూరుపు కనుమలలోసూరీడు, రాతిరి జాబిలి  వెలుగులతో పాటు పోటీపడుతూ, కొత్త సంవత్సరంలోకి అడుగువేయిస్తున్న  ఒక రోజును!

నా పేరు ఒకటో తేది !! నా మాతృక జనవరి!!!

కోటి కోటి అవసరాలుతీర్చే వరాన్ని! ఒకటోతేదీని!!

-కొండపల్లి నీహారిణి

Related posts

అటెన్షన్: కరోనా జాగ్రత్తలపై గ్రామాలలో మైకు ద్వారా ప్రచారం

Satyam NEWS

ప్రకృతి వనం స్మశాన వాటిక ప్రారంభించిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

Satyam NEWS

వైఎస్సార్సీపీ మైనార్టీ నేతలు ఫోన్ లోనే పంచాయతీ…!

Bhavani

Leave a Comment