33.7 C
Hyderabad
April 30, 2024 00: 21 AM
Slider గుంటూరు

ట్రాఫిక్ రూల్సు పాటిస్తే ప్రమాదాలు జరగవు

#APSRTC

డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అలా చేస్తే ప్రమాదాలు నివారించ వచ్చునని పల్నాడు జిల్లా నరసరావుపేట డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ విజయ భాస్కర్ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల (27- 01-23 నుండి 02-02-23 వరకు) ముగింపు కార్యక్రమం నేడు ఏపీఎస్ఆర్టీసీ నరసరావుపేట డిపో గ్యారేజ్ లో జరిగినది.

సభా పరిచయ కార్యక్రమం నరసరావుపేట డిపో మేనేజర్ వీరస్వామి ప్రారంభించారు. ఈ సభకు అధ్యక్షులుగా పల్నాడు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్ శ్రీనివాసరావు నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిధిగా వచ్చిన విజయభాస్కర్ మాట్లాడుతూ డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. డిస్టిక్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ పరంధామ రెడ్డి మాట్లాడుతూ డ్రైవర్లు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మద్యానికి బానిసలు కావద్దని డ్రైవర్ చాలా ఫిట్ గా ఉండాలని కోరారు.

అలాగే టూ టౌన్ సిఐ డిప్యూటీ సీ ఎం ఇ నర్రా శ్రీనివాసరావు పాల్గొని ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్లకు సన్మానం, ప్రశంసా పత్రాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలనాడు జిల్లాలోని ఆరు డిపోల నుండి డిపో మేనేజర్లు సూపర్వైజర్లు కార్మిక నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

Related posts

బిల్ట్ పునరుద్ధరణ లో జాప్యం సహించేది లేదు

Satyam NEWS

తీర్ధాల జాతరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు: పోలీస్ కమిషనర్

Sub Editor 2

ఆలయ భూమి అడిగితే కేసు పెడతారా..?

Satyam NEWS

Leave a Comment