27.7 C
Hyderabad
April 30, 2024 09: 37 AM
Slider విజయనగరం

ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు

#deepikaips

విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక  స్ట్రాంగ్ వార్నింగ్

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను నిర్వహించేందుకు మెస్సర్స్ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జెపివిఎల్) టెండర్ల ద్వారా ప్రభుత్వం నుండి అనుమతి పొందిందని జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు. జెపివిఎల్  అనుమతించిన వ్యక్తులకు మాత్రమే రాష్ట్రంలో ఇసుక విక్రయాలను నిర్వహించేందుకు అనుమతి ఉందన్నారు.

ఇతరులు ఎవరైనా తాము ఇసుక సబ్ కాంట్రాక్టర్, లేదా ఇతర పేర్లతో ఎటువంటి ఇసుక లావాదేవీలు జరిపినా చట్టపరంగా క్రిమినల్  కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కొందరు వ్యక్తులు తాము  సబ్ కాంట్రాక్ట్ లు  పొందారని ,జిల్లాల వారీగా విక్రయాలను నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఇప్పటికే జెపివిఎల్ ఖండించిందన్నారు.  అలా ఎవరైనా ప్రచారం చేసుకున్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా జెపివిఎల్ పోలీస్ శాఖను కోరడం జరిగిందని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.

Related posts

కాసుల కక్కుర్తి తో నరకం చూపిస్తున్న వ్యవస్థ

Satyam NEWS

కానిస్టేబుల్‌ ఉద్యోగార్థులకు సీఎం తీపికబురు

Bhavani

అభివృద్ధికి ఆమడ దూరంలో ఆదివాసీ గ్రామాలు

Satyam NEWS

Leave a Comment