37.2 C
Hyderabad
May 6, 2024 11: 55 AM
Slider ప్రత్యేకం

కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణా

#illegalsand

అన్నమయ్య జిల్లా రాజంపేట మందరం లో ఇసుక దోపిడీ కొనసాగుతున్నది. ఏప్రిల్ లో ఈసీ గడువు ముగిసినా అక్రమ ఇసుక తరలింపు కొనసాగుతోంది. చెయ్యేరు లో గుడారము వేసి మనుషులను పెట్టి బిల్లులు ఇస్తూ నిత్యం టిప్పర్ లు, ట్రాక్టర్లతో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక దోపిడీ సాగుతోంది. తమ దృష్టికి వచ్చినా రాజకీయ ఒత్తిళ్లతో మైనింగ్, ఎన్ఫోర్స్ మెంట్, రెవెన్యూ,పోలీస్ యంత్రాంగం పట్టించు కోవడం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి.

వారికి ఫిర్యాదు చేసినా పొంతన లేని సమాధానాలతో తప్పించుకునే వైనం కనబడుతోంది. రాష్ట్రంలో విచక్షణారహితంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ గుంటూరు జిల్లా ధరణికోటకు చెందిన నాగేంద్ర కుమార్ జాతీయ హరిత ట్రిబ్యునల్లో 2021లో పిటిషన్ దాఖలు  చేశారు. దీనిపై విచారణ జరిపి రాష్ట్రంలో ఇసుక తవ్వకాలను నిలిపి వేయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 27న స్టేట్ ఎన్విరాన్మెం ట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ (ఎస్ఈఐఏఏ) కి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది. అయితే దాన్ని ఖాతరు చేయకుండా నిబంధనలు తుంగలో తొక్కి రాజంపేట మండలం మందరం లో  ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది.

Related posts

అనాథను ఆదుకుని మానవత్వం చాటిన యూత్

Satyam NEWS

నూతన విభాగంతో  మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట

Satyam NEWS

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ

Satyam NEWS

Leave a Comment