27.7 C
Hyderabad
April 30, 2024 08: 38 AM
Slider కడప

అర్ యూబీని వెంటనే  పూర్తి చేయాలని నిరసన

#RUB

రాజంపేట రైల్వే అండర్ బ్రిడ్జి ( అర్ యూబి) వెంటనే పూర్తి చేయాలని అర్ యూబి సాధన సమితి ప్రతినిధి చిట్వేలి రవికుమార్ డిమాండ్ చేశారు. అర్ యూబి నిర్మాణాన్ని పూర్తి చేయడం పై పాలకుల అలసత్వ వైఖరి వీడాలన్న డిమాండ్ తో  విద్యార్థుల తల్లిదండ్రులు, అసంఘటిత కార్మికులతో ఆదివారం అన్నమయ్య జిల్లా రాజంపేటసల్  రైల్వే స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ రైల్వేశాఖకు సంబంధించి అర్ యూబి పనులు  ఆరేళ్ల క్రితమే పూర్తి అయ్యాయని, అయితే రాష్ట్ర ప్రభుత్వంకు సంబందించి చేపట్టాల్సిన పనులు  చేపట్టక పోవడంతో ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్ కు అవతలి వైపు ప్రభుత్వ హైస్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాలలు, కేంద్రీయ విద్యాలయం, ఎస్సీ, బీసి హాస్టల్స్ ఉన్నాయని, అందువల్ల విద్యార్థులు సైకిళ్ల పై ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీద రాక పోకలు సాగిస్తున్నారని తెలిపారు.

అయితే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై వాహనాలు అతివేగంగా వెలుతున్నందున పలుమార్లు విద్యార్థులు ప్రమాదాల భారిన కూడా పడిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. హిందు, ముస్లింలకు సంబంధించిన స్మశాన వాటికలు రైల్వే స్టేషన్ అవతలి వైపు ఉన్నాయన్నారు. అందువల్ల బలిజపల్లెరోడ్డు, గంగిరెడ్డిపాలెం, అర్ఎస్ రోడ్డు ప్రాంతాలకు చెందిన ఎవరైనా చనిపోతే ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదుగా తీసుకు  వెళ్లాల్సి వస్తుందన్నారు. ఇందువల్ల అదనంగా దాదాపు ఒకకటిన్నర కిలోమీటరు దూరం  మృతదేహాన్ని తీసుకు వెళ్లాల్సి వస్తుందని ఆయన అవేదన వ్యక్తం చేశారు.

అర్ యూబి పూర్తి అయితే ఆ ప్రాంతంలోని చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడి వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగు పడతాయని తెలిపారు. విద్యార్థులు, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే అర్ యూ బినీ పూర్తి చేసేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల స్పందించ కుంటే అర్ యూబీని సాధించు కునేందుకు ఆందోళనలు ఉదృతం చేస్తామని రవికుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పగిడి సుబ్బరాయుడు, సుబ్రమణ్యం రెడ్డి, రమణ, రమేష్, సురేష్, తోట హరి, జిలానీ,  శంకరయ్య, కాలేషా, రెడ్డప్ప, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా హెల్ప్: తెలంగాణ శ్రీచైతన్య విరాళం రూ.10 లక్షలు

Satyam NEWS

హుజురాబాద్ లో కుండపోతగా కురిసిన వర్షం

Satyam NEWS

మంత్రి హరీష్ రావు కాన్వాయ్ కి తప్పిన పెను ప్రమాదం

Satyam NEWS

Leave a Comment