42.2 C
Hyderabad
April 30, 2024 16: 46 PM
Slider గుంటూరు

చీకటి మాటున…ఇసుక తరలింపు

#.sand move

ఇసుక అక్రమ రవాణాకు బాపట్ల ప్రధాన కేంద్రంగా మారింది. ఇసుక బకాసురులకు స్థానికంగా అధికారులు సహకరించడంతో అర్ధరాత్రి సమయాలలో అడ్డదారిలో ఇసుక తరలిస్తూ అసైన్డ్ భూములను గోతులుగా మారుస్తున్న వైనం బాపట్లలో కనిపిస్తుంది. స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం ఉన్నత అధికారులు కళ్ళు గప్పించి అర్ధరాత్రి ఇసుక తరలించేలా ఇసుకాసురులకు సలహాలు చేస్తున్నారనే విమర్శలు ఘాటుగానే వినబడుతున్నాయి.

నిర్మాణ రంగంలో ఇసుకకు భారీ గిరాకీ ఉంది . నిర్మాణ పనులకు బుసక వినియోగిస్తున్నారు. బాపట్ల మండలంలో అసైన్డ్ భూముల్లో ఇసకతవకాలు అర్ధరాత్రి సమయాల్లో చేపడుతూ ట్రాక్టర్లు ద్వారా ఇటు బాపట్లకు, అటు చీరాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

స్టువర్టుపురంలో…బాపట్ల మండలం వెదుళ్ళపల్లి, స్టువర్టుపురం లో ఇసుక వ్యాపారం జోరుగా సాగుతుంది. కుందేరు వాగులను, అసైన్డ్ భూములను ఎంపిక చేసుకొని జెసిబిలతో అర్ధరాత్రి స్థిరాస్తి వ్యాపారులకు, భవన నిర్మాణదారులకు ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న ఏ అధికారికి అనిపించక పోవడం కొసమెరుపు. ఎడ్ల బండి ఇసుకకు 2000, ట్రాక్టర్ ట్రక్కు ఇసుకకు 4000 చొప్పున ఇసకాసురులు వసూలు చేస్తూ ఇసుకను విక్రయాలు చేస్తున్నారు.

జెసిబి లతో ఇసుకను తొవ్వేస్తూ సుమారు 15 నుంచి 20 అడుగుల మేర గోతులు తీస్తున్నారు. దీనితో భూగర్భ జలాలు అడుగంటు తున్నాయి.స్థానికంగా ఉన్న రెవెన్యూ, పోలీస్ అధికారులకు కొందరు గ్రామస్తులు సమాచారం ఇచ్చిన చూసి చూడనట్లు వదిలేస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు.

ఆశ్చర్యం ఏమిటి అంటే అర్ధరాత్రి సమయంలో ఇసుక తరలించే ట్రాక్టర్లు పోలీస్ స్టేషన్ ముందు నుండే వెళ్తున్న పోలీసుల కంటికి కనిపించకపోవడం శోచనీయంగా మారింది.ఇటీవల కాలంలో అర్ధరాత్రి సమయంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారని స్థానికంగా ఉన్న ఎస్ఐకి సమాచారం రావడంతో సుమారు 15 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని కొన్ని ట్రాక్టర్లను తహశీల్దార్ కోర్టులో హాజరు పరిచి రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో మిగిలిన ట్రాక్టర్లు వదిలేసారని విమర్శలు లేకపోలేదు.

Related posts

భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి

Satyam NEWS

అక్షరాశృతర్పణం

Satyam NEWS

ఆత్మహత్యలు నిరుద్యోగులకు రాజభోగం కేసిఆర్ కుటుంబానికా?

Satyam NEWS

Leave a Comment