వృత్తిదారుల సమస్యలపై ఈ నెలలో జరుగుతున్న వివిధ ఆందోళనలో వృత్తిదారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలనిఉ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎర్ర శ్రీకాంత్ పిలుపునిచ్చారు. స్థానిక మంచి కంటి మీటింగ్ హాల్లో తుషాకుల లింగయ్య అధ్యక్షతన జరిగినసమన్వయ కమిటీ సమావేశంలో యర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం బీసీ బందు పేరుతో వృత్తిదారులకు లక్ష రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు.
కానీ ఆచరణలో మాత్రం వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తే పదుల సంఖ్యలో లబ్ధిదారులను ఎంపిక చేస్తూ తీవ్ర మోసానికి గురి చేస్తుందన్నారు. పైగా ఈ ఎంపిక చేసే లబ్ధిదారులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పిన వారికి మాత్రమే లిస్టులలో పేర్లు వస్తున్నాయని విమర్శించారు. వృత్తిదారులను ఆశలకు గురిచేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.
లబ్ధిదారుల ఎంపికలో గ్రామసభల ద్వారా అర్హులందరినీ గుర్తించి పథకాల అమలు చేయాలని లేనియెడల తీవ్ర ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని తెలిపారు. మైనారిటీ బందును వెంటనే ప్రకటించాలని, దివ్యాంగులకు పెన్షన్ 10,000/- కు పెంచాలని, గొర్రెల పంపిణీ పథకం నగదు బదులు రూపంలో అందరికీ ఇవ్వాలని తదితర డిమాండ్ల పైన ఆందోళన చేపట్టనున్నట్టు తెలిపారు. వృత్తిదారుల సమస్యలపై ఈ నెలలో జరుగుతున్న వివిధ ఆందోళనలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో వివిధ వృత్తిదారుల సంఘాల జిల్లా నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, ఎంఏ ఖయ్యూం, ఎస్కే గౌస్ ఉద్దీన్, బోడపట్ల సుదర్శన్, సత్తెనపల్లి శ్రీను, అన్నారపు వెంకటేశ్వర్లు, నాగరాజు, ఎస్కే బాబు, ఎస్కే కాసిం, ఇమ్మడి గోపాల్ రావు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.