31.2 C
Hyderabad
May 2, 2024 23: 23 PM
Slider కరీంనగర్

మంత్రి గంగుల టార్గెట్ గా ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు?

హైదరాబాద్ తోపాటు కరీంనగర్ లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు. ధానంగా కరీంనగర్ కు చెందిన రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ నాయకుడు గంగుల కమలాకర్ తోపాటు గ్రానైట్ వ్యాపారుల ఇల్లు కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని పంజాగుట్టలోని పీఎస్ఆర్ గ్రానైట్స్ హైదరాబాద్ గూడలోని జనప్రియ అపార్ట్ మెంట్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సోమాజీగూడలో గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ నివాసంలోనూ సోదాలు జరిగాయి. కరీంనగర్ లోని గంగుల కమలాకర్ ఇంటితోపాటు కమ్మతోటలోని ఆయనకు చెందిన శ్వేత గ్రానైట్ కమాన్ ప్రాంతంలోని మహవీర్ ఎస్వీఆర్ గ్రానైట్స్ లో ఐటీ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్ వ్యాపారి అరవింద్ వ్యాస్ తోపాటు మరికొంత మంది ఇళ్లు కార్యాలయాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. గతంలోనే 8 ఏజెన్సీలకు ఎన్ ఫోర్సుమెంట్ డైర్టరేట్ (ఈడీ) నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సుమారు 20 మంది అధికారులు బృందాలుగా తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం.

Related posts

హింసామార్గం వీడండి అహింసాపద్ధతులను అవలంబించండి

Satyam NEWS

తెలంగాణకు ఆక్సిజన్, వ్యాక్సిన్ అదనపు కోటా విడుదల

Satyam NEWS

మెదక్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం

Satyam NEWS

Leave a Comment