37.2 C
Hyderabad
April 30, 2024 14: 11 PM
Slider క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం.. ఎయిర్‌రైఫిల్‌లో ప్రపంచ రికార్డు

#Asian Games

ఆసియా క్రీడల్లో భారత్‌ అథ్లెట్ల హవా ప్రారంభమైంది. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ విభాగంలో టీమ్‌ఇండియా స్వర్ణ పతకం సాధించింది.ఈ క్రమంలో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. రుద్రాంక్ష్ పాటిల్, దివ్యాన్ష్‌, తోమర్‌తో కూడిన బృందం ఫైనల్‌లో 1893.7 పాయింట్లను నమోదు చేసింది. దీంతో గతంలో చైనా చేసిన 1893.3 పాయింట్ల రికార్డును అధిగమించింది.

ప్రస్తుతం టీమ్‌ఇండియా ఖాతాలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ విభాగంలో జట్టుగా స్వర్ణం గెలిచిన రుద్రాంక్ష్‌, దివ్యాన్ష్‌, తోమర్‌ వ్యక్తిగతంగానూ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ఫైనల్‌ కోసం జరిగిన పోటీల్లో రుద్రాంక్ష్‌ మూడో స్థానం, తోమర్‌ ఐదోస్థానం, దివ్యాన్ష్ ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మరోవైపు మెన్స్‌ ఫోర్ రోయింగ్‌ ఈవెంట్‌లోనూ భారత్‌ కాంస్య పతకం దక్కించుకుంది.

Related posts

దొంగ దెబ్బ

Satyam NEWS

అటవీ అనుమతులపై రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు భేటీ

Satyam NEWS

కుప్పంలో 18 లక్షల టన్నుల బంగారం

Satyam NEWS

Leave a Comment