40.2 C
Hyderabad
May 2, 2024 18: 48 PM
Slider నల్గొండ

కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇందిరాగాంధీ బాటను ఎంచుకోవాలి

#Indira Gandhi

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిర సెంటర్లో  ఇందిరా గాంధీ 103వ, జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాముల శివారెడ్డి, యరగాని నాగన్న గౌడ్, ఎండి అజీజ్ పాషా మాట్లాడుతూ ఇందిరా గాంధీ తన పాలనతో దేశంలో గుణాత్మకమైన మార్పులు తీసుకు వచ్చిన ధైర్యశాలి అని, భారత ప్రధానిగా ఉన్న సమయంలో లో నా పాకిస్తాన్ యుద్ధంలో ఆమె ప్రదర్శించిన తీరును నాటి భారతీయ జనతాపార్టీ నాయకులు అటల్ బిహారీ వాజ్ పాయ్ ఇందిరా గాంధీని అపార దుర్గ గా అభివర్ణించారని గుర్తు చేశారు.సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకొని అంతర్జాతీయంగా శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా భారతదేశాన్ని నిలబెట్టిన గరీబీ హఠావో అంటూ నినదించిన  

భారతదేశ తొలి మహిళా ప్రధాన మంత్రి ,ఉక్కు మహిళ ,దేశం గర్వించదగిన గొప్ప  నాయకురాలు ఇందిరా గాంధీ అని అన్నారు.

బ్యాంకుల జాతీయకరణ, ఎస్సీ,  ఎస్ టి, లకు భూపంపిణీలు రాజభరణాల రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయాలతో పరిపాలన సాగించిన ఏకైక మహిళా మూర్తి అని అన్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయురాలికి   ఘన నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇందిరాగాంధీ బాటను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, జక్కుల మల్లయ్య, మున్సిపల్ కౌన్సిలర్ ములకలపల్లి రామగోపి, వెలిదండ సరిత వీరారెడ్డి, కోల మట్టయ్య, బెల్లంకొండ గురవయ్య, యడవెల్లి వీరబాబు, లచ్చిమళ్ళ నాగేశ్వరరావు, అజ్మతుల్లా, కంకణాల పుల్లయ్య, ఇంటిమల్ల బెంజిమెన్, పోతుల జ్ఞానయ్య, ఆకారపు సుదర్శన్, ములకలపల్లి లక్ష్మయ్య, గంజి చంద్రమౌళి, పోతనబోయిన రామ్మూర్తి, తేలు కుంట్ల వెంకటేశ్వర్లు, శివపార్వతి, దొంతగాని జగన్, భీమిశెట్టి గోపి, రవి, సంక్రాంతి  కోటేశ్వరరావు, ఎస్ కె బిక్కన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయి

Satyam NEWS

8 ఏళ్ల బాలిక పై అత్యాచారం హత్య కేసు నిందితుడికి ఉరిశిక్ష

Bhavani

హమ్మయ్య… వర్షం వచ్చింది.. లేకుంటే పరువు పోయేది…

Satyam NEWS

Leave a Comment