39.2 C
Hyderabad
April 28, 2024 11: 43 AM
Slider ప్రపంచం

భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసం షురూ

#USmilitary

ఉత్తరాఖండ్‌లోని ఔలీలో భారత్, అమెరికా సైన్యాల మధ్య జరిగే వార్షిక సైనిక విన్యాసాలు ప్రారంభం అయ్యాయి. యుద్ధ అభ్యాస్-2022 పేరుతో సాగే ఈ విన్యాసాలు ఇరు దేశాల సైనికులు కొత్త కొత్త యుద్ధ మెళకువలు నేర్చుకోవడానికి దోహదపడుతుంది. ఉత్తరాఖండ్‌లోని ఔలి సముద్ర మట్టానికి సుమారు 10,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత ఎత్తైన పర్వత ప్రాంతంలో తొలిసారిగా ఓ స్నేహ దేశ సైన్యంతో కలిసి భారత సైన్యం సైనిక విన్యాసాలు చేస్తోంది.

అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే  ఔలీ ప్రాంతం చైనా సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున ఈ కసరత్తు చైనా ఆందోళనను పెంచింది. ఈ యుద్ధ అభ్యాస్ లో ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్, ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్, ఫోర్స్ మల్టిప్లైయర్స్, ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ ఆపరేషన్ ఆఫ్ సర్వైలెన్స్ గ్రిడ్, ఆపరేషనల్ లాజిస్టిక్స్ మరియు మౌంటైన్ వార్‌ఫేర్ స్కిల్స్ ఉన్నాయి.

ఈ కసరత్తు ఇరు దేశాల సైన్యాలకు తమ అపారమైన అనుభవాలను, నైపుణ్యాలను పంచుకోవడానికి, సమాచార మార్పిడి ద్వారా తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఈ కసరత్తులో, రెండు దేశాల సైన్యం ఒకదానికొకటి ఎత్తైన ప్రదేశంలో సైనిక యుద్ధ వ్యూహం ఎలా ఉండాలి అనే అంశంపై కసరత్తు చేస్తున్నాయి. 12 నెలల పాటు మంచు కురుస్తున్న అలస్కా వంటి అతి శీతల ప్రాంతాలలో యుఎస్ ఆర్మీ కూడా ఉంది.

Related posts

ప్రజలందరికీ ఉచితంగా విద్య వైద్యం అందించాలి: టిపీటీయఫ్

Satyam NEWS

తీన్మార్ మల్లన్న కార్యాలయంలో పోలీసు తనిఖీలు (వీడియో చూడండి)

Satyam NEWS

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ర‌హ‌దారుల నిర్మాణంపై సమీక్ష‌

Satyam NEWS

Leave a Comment