31.7 C
Hyderabad
May 2, 2024 11: 00 AM
Slider మెదక్

ప్రజలందరికీ ఉచితంగా విద్య వైద్యం అందించాలి: టిపీటీయఫ్

#teachers

ప్రజలందరికీ సాధ్యమయినంత తొందరగా టీకా అందించి కరోనా మహమ్మారి నుండి రక్షించాలని టిపీటీయఫ్ రాష్ట్ర సీనియర్ నాయకులు వి. రాజమౌళి కోరారు.

తెలంగాణ ప్రోగ్రేసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు దుబ్బాక జోన్ కన్వీనర్ అమ్మన నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మండల వనరుల కేంద్రం వద్ద ఆయన పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరికీ ఉచితంగా విద్య, వైద్యం అందించాలని ,వెంటనే అన్ని ప్రయివేటు ఆసుపత్రులు జాతీయం చేసి కార్పొరేట్ ఆసుపత్రుల ఫీజుల దోపిడీని హరికట్టాలని డిమాండ్ చేశారు.

టిపీటీయఫ్ ఉపాద్యాయుల సమస్యలతో    పాటు సామాజిక స్పృహ కలిగిన సంఘంగా సామాజిక సమస్యల పరిష్కారానికి ఒంటరిగా, ఇతర సంస్థలు ,సంఘాలతో ఐక్య ఉద్యమాలు నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిపీటీయఫ్ సీనియర్ నాయకులు కొండా వెంకటయ్య మండల అసోసియేట్ అధ్యక్షుడు మధుసూదన్ నాయకులు మల్లేశం,ఎల్లం , బాలకృష్ణ, ప్రదీప్ కుమార్, భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయిన ఎన్నికల సంఘం

Satyam NEWS

బి అర్ ఎస్ లో చేరిన మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు

Bhavani

కార్మిక పక్షపాతి నాయిని నర్సింహారెడ్డి మృతి తీరనిలోటు

Satyam NEWS

Leave a Comment