33.7 C
Hyderabad
April 30, 2024 00: 50 AM
Slider ముఖ్యంశాలు

అటవీ క్షేత్రాధికారుల ప్రవేశ శిక్షణా కార్యక్రమ ప్రారంభం

9 వ బ్యాచ్ అటవీ క్షేత్రాధికారుల ప్రవేశ శిక్షణా కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ, దూలపల్లి, హైదరాబాదు లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాకేష్ మోహన్ డోబ్రియాల్, అటవీ ప్రధాన ముఖ్య రక్షణాధికారి మరియు తెలంగాణ రాష్ట్ర అటవీ దళాల అధిపతి ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ అటవీ విద్య, శిక్షణలను అందించడంలో ముఖమైన సంస్థ అని, శిక్షణార్థులు అకాడమీ వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, శీతోష్ణస్థితి మార్పు, భూతాపం, మానవ-వన్యప్రాణి ఘర్షణ, మొదలగు సవాళ్ళ నేపథ్యంలో తాము ఎంచుకున్న ఏదైనా అటవీ విభాగంలో నైపుణ్యాలను పొంది, తద్వారా ఆయా రంగాలలో ఉన్నత ప్రమాణాలు సాధించడానికి కృషి చేయాలని కోరారు.

పద్దెనిమిది నెలలు కొనసాగే ఈ శిక్షణలో 47 మంది అధికారులకు శిక్షణ ఇవ్వబడుతుంది. వీరిలో 42 మంది గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, 5 గురు జమ్మూ& కాశ్మీర్ కు చెందినవారున్నారు. పీ వీ రాజారావు, అటవీ అదనపు ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి మరియు అకాడమీ సంచాలకులు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. వి ఆంజనేయులు, ఉప సంచాలకులు 9 వ బ్యాచ్ అటవీ క్షేత్రాధికారుల శిక్షణా కార్యక్రమ కోర్సు సంచాలకులు శిక్షణా కార్యక్రమ వివరాలను సమర్పించారు. ఏ పి సింగ్, అటవీ అదనపు ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి, గుజరాత్ రాష్ట్ర అటవీ శాఖ; పి రఘువీర్, మునీంద్ర మాజీ సంచాలకులు, తెలంగాణ అటవీ అకాడమీ, జీ నర్సయ్య మాజీ సంరక్షణాధికారి అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.

అటవీ అకాడమీ అదనపు డైరెక్టర్ మరియు ముఖ్య సంరక్షణాధికారి ఎస్. రమేశ్, అకాడమీ సంయుక్త డైరెక్టర్ ప్రవీణ, డిప్యూటీ డెరైక్టర్ లు ch గంగా రెడ్డి, v రామ మోహన్, nr సంగీత , sa నాగినీ బాను ; రేంజ్ అధికారులు, M వంశీ కృష్ణ, Y సుభాష్ చంద్ర యాదవ్, K శివ జ్యోతి, M రామ్ మోహన్, సెక్షన్ అధికారి ప్రవీణ్ కుమార్, ఫిజికల్ ట్రైనర్స్, అశోక్ రెడ్డి, కొండల్ రావు , రఫీ ఉల్లా, శిక్షణ అటవీ సెక్షన్ అధికారులు, శిక్షణ అటవీ క్షేత్రాధికారులు ఇతర సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

శరవేగంగా సాగుతున్న జేఎన్టీయూ నిర్మాణ పనులు

Satyam NEWS

కేంద్ర బడ్జెట్లో అసంఘటిత రంగ కార్మికులకు అన్యాయం

Satyam NEWS

ఇళ్లు కట్టుకున్న తర్వాత మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

Satyam NEWS

Leave a Comment