33.7 C
Hyderabad
April 29, 2024 02: 32 AM
Slider నల్గొండ

కేంద్ర బడ్జెట్లో అసంఘటిత రంగ కార్మికులకు అన్యాయం

#CITUHujurnagar

కార్మికుల హక్కుల కోసం CITU నిరంతరం పోరాటం చేస్తుందని భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేస్తే ఎవరిని వదిలిపెట్టదు అని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్యగౌడ్ అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ శిల్ప కళ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ CITU అనుబంధ సంఘం జనరల్ బాడీ సమావేశం  హుజుర్ నగర్ పట్టణ అధ్యక్షుడు ఉప్పల వెంకన్న అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సోమయ్య గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో అసంఘటిత రంగ కార్మికులకు అన్యాయం చేసిందని, ఇది పెట్టుబడిదారుల ప్రభుత్వం అని మరొక సారి ఋజువు చేసిందని ఆరోపించారు.

అనేక సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న భవన,ఇతర నిర్మాణ కార్మికుల హక్కులను హరించే పద్ధతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలని హితవు పలికారు. అన్ని కార్మిక సంఘాల హక్కుల రక్షణ కోసం మరిన్ని పోరాటాలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో భవన నిర్మాణ కార్మికులు పనులు దొరకక అనేక మంది పస్తువులతో ఉన్నారని, ఆ సమయంలో ఆదుకుంటామని చెప్పిన రాష్ట్ర,  కేంద్ర ప్రభుత్వాలు మాటలకే పరిమితం అయ్యిందని,ఏ ఒక్కరికి సాయం చేయలేదని అన్నారు.

తక్షణమే ప్రతి కార్మికుడికి నెలకు 7500 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెయింటింగ్ వర్క్ చేస్తూ జీవన ఉపాధి కొనసాగిస్తున్న లక్ష్మీకాంత్ భార్యకి కడుపులో కణితి తొలగించుటకు తెలంగాణ శిల్ప కల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు అందరూ 4000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో CITU జిల్లా కోశాధికారి రాంబాబు,భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు ఉప్పల గోవిందు, షేక్ ముస్తాఫా, ఉప్పల నరేష్, పల్లపు రామకృష్ణ, చల్లా జయకృష్ణ, శ్రీనివాస్, సాయి, శీలం వేణు, వీర నాగేశ్వరరావు, వెంకన్న రాజు, సీతారాములు, అశోక్, కరుణాకర్, వీరబాబు, సతీష్, నరసింహారావు, శ్రీకాంత్, హరి తదితరులు పాల్గొన్నారు.

Related posts

వ్యాసాయ విష్ణు రూపాయ..విజ‌య‌న‌గ‌రంలో వ్యాస భ‌గ‌వానుడు….ఎక్క‌డంటే..?

Satyam NEWS

విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ హత్య

Satyam NEWS

‘స్పందన’దృశ్య శ్రవ్య సంచికల ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment