32.7 C
Hyderabad
April 27, 2024 02: 52 AM
Slider తూర్పుగోదావరి

ఇళ్లు కట్టుకున్న తర్వాత మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

#Minister Venu

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని వెలంపాలెం గ్రామం చుట్టుపక్కల ఉన్న పేదప్రజలకు 533 ఇండ్ల స్థలాలు మంజూరయ్యాయి.

ఏడు కోట్ల అరవై ఐదు లక్షలు విలువ చేసే ఈ స్థలాలు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి  జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా, ఆర్.డి.ఓ.కుమారి సింధు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

ఈ స్థలాలు లో ఇల్లు కట్టుకునే వారికి సిమెంట్ 240 రూ.కే ఇవ్వడం, కరెంట్ కూడా ప్రతి లబ్దిదారులకు ఇస్తున్నారు. దాంతో అందరూ ఇల్లు కట్టుకోవడానికి సిద్ధం అయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే తరువాత కరెంట్,మంచి నీరు కుళాయిలు, గ్రౌండ్ కేబుల్స్ డ్రైన్స్  తో ఏర్పాటు చేస్తామని చెప్పారు.

533 స్థలాలు లో 33 మంది లబ్దిదారులకు కట్టుకునే ఓపిక లేక గవర్నమెంట్ కట్టి ఇవ్వాలంటూ కోరడంతో అదే విధంగా కట్టడానికి సిద్ధం చేశారు.

మంత్రి వేణు మాట్లాడుతూ ఈ స్థలాల్లో  ప్రతి లబ్దిదారులు అందరికి ఇల్లు సొంతంగా కట్టుకోవడానికి లోను సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు.

జగనన్న నవరత్నాలు లో భాగంగా సొంత ఇంటి కల నెరవేరుతుంది అని వ్యాఖ్యానించారు.

Related posts

నిన్న కర్నూలు..నేడు ఏలూరు: వైసీపీ దళిత ఎమ్మెల్యే పట్ల వివక్ష

Satyam NEWS

నాగర్ కర్నూల్ ఆసుపత్రికి అదనపు హంగులు

Satyam NEWS

నవంబర్ 21 వరకు విద్యాసంస్థల మూత : సీఏక్యూఎం

Sub Editor

Leave a Comment