38.2 C
Hyderabad
April 29, 2024 14: 32 PM
Slider గుంటూరు

శరవేగంగా సాగుతున్న జేఎన్టీయూ నిర్మాణ పనులు

#mlagopireddy

సెప్టెంబర్ నుంచి ఫస్ట్ ఇయర్ క్లాస్లు ప్రారంభిస్తాం: ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని కాకాని గ్రామంలో నిర్మితమవుతున్న జేఎన్టీయూ కళాశాల పనులను శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం కళాశాల వైస్ ప్రిన్సిపాల్, డీఈ, ఏఈ లతో కలిసి పరిశీలించారు.

అనంతరం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు శరవేగంగా సాగుతున్నాయని, సెప్టెంబర్ మాసంలో జాయిన్ కాబోయే మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ఇక్కడ నుంచే నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

అలాగే పమిడిమర్రు గ్రామం వరకు రోడ్డు కూడా వేస్తామని చెప్పారు. ఒక వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధి రెండు జరుగుతున్నాయని వివరించారు. గత టీడిపి పాలనలో కళాశాల కోసం ఇటుక బిళ్ళ కూడా వేయని వారికి నేడు విమర్శించే హక్కు లేదన్నారు.

వీలైంత త్వరగా కళాశాల శాశ్వత భవనం హాస్టల్స్ నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మూరబోయిన శ్రీనివాస రావు, జెడ్పీటీసీ చిట్టిబాబు, మాజీ ఎంపీపీ తన్నీరు శ్రీనివాస రావు, ఉప్పలపాడు, పమిడిమర్రు, కాకాని గ్రామ పెద్దలు, నాయకులు, కాంట్రాక్టర్లు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

విభజన సమయంలో విడిపోయిన సోదరుడిని కలుకోడానికి పాక్ అంగీకారం

Satyam NEWS

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్

Satyam NEWS

శివుడా! ఆయనెవరు? నా దేవుడు మంత్రి పెద్దిరెడ్డే!

Satyam NEWS

Leave a Comment