39.2 C
Hyderabad
April 30, 2024 20: 58 PM
Slider సంపాదకీయం

ఎమ్మెల్సీల్లో అన్యాయం: భగ్గుమన్న బ్రాహ్మణ, వైశ్య కులాలు

#jagan

అత్యధికంగా ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసే సమయంలో కూడా అధికార వైసీపీ బ్రాహ్మణ, వైశ్య కులాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం పట్ల ఆ కులాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకటి రెండు స్థానాలు భర్తీ చేయాల్సిన సమయంలో తమ వాటాను తాము అడగమని అయితే ఇంత భారీ స్థాయిలో ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసే సమయంలో కూడా బ్రాహ్మణులకు కానీ ఆర్య వైశ్యులకు గానీ స్థానం కల్పించకపోవడం అన్యాయమని వారు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు.

గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో బ్రాహ్మణ, ఆర్యవైశ్య కులాల వారు మూకుమ్మడిగా వైసీపీకి మద్దతు పలికారు. దాదాపు 50 వరకూ పట్టణ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాలలో గణనీయమైన ఓట్లు ఉన్న బ్రాహ్మణ, వైశ్య కులస్తులు గెలుపు పై ప్రభావం చూపిస్తారు. గత ఎన్నికలలో బ్రాహ్మణ, వైశ్య కులాల వారు వైసీపీకి మద్దతు పలకడం వల్లనే వైసీపీకి అంత మెజారిటీ వచ్చింది. అధికారంలోకి రాక ముందు దేవాలయాల్లో పూజలు చేయడం, మతం మారినట్లుగా విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానంద ఆధ్వర్యంలో నీటిలో మునిగిన ఫొటోలు పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో జగన్ పట్ల బ్రాహ్మణులకు, వైశ్యులకు విపరీతమైన అభిమానం వచ్చింది.

దాంతో మూకుమ్మడిగా ఈ రెండు అగ్రకులాలు వైసీపీకి ఓట్ల వర్షం కురిపించాయి. అంతే కాకుండా ఎన్నికల ప్రచార సమయంలో బ్రాహ్మణులకు, వైశ్యులకు పలు హామీలను కూడా జగన్ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణులకు, వైశ్యులకు తమకు రావాల్సిన రాజకీయ వాటా ఇవ్వకుండా మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఒక బ్రాహ్మణుడికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చారు. ఒక వైశ్యుడికి మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. రెండున్నర సంవత్సరాల తర్వాత ఆ ఇద్దరికి పదవి పీకేసి వారికి ప్రత్యామ్నాయంగా మరో బ్రాహ్మణుడికి గానీ, వైశ్యుడికి గానీ మంత్రి వర్గంలో స్థానం కల్పించలేదు.

బ్రాహ్మణుడి నుంచి పీకేసిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిని వైశ్యుడికి ఇచ్చి ఊరుకున్నారు. మంత్రి వర్గంలో స్థానం కల్పించలేదు. బ్రాహ్మణ కార్పొరేషన్ లోగానీ, వైశ్య కార్పొరేషన్ లో గానీ చిల్లిగవ్వ నిధులు లేకుండా చేశారు. నామమాత్రంగా కూడా రాజకీయ పదవుల్లో అవకాశాలు కల్పించకపోవడంతో బ్రాహ్మణులు వైశ్యులు వైసీపీ పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తమ ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ తమకు ఇంత అన్యాయం చేసిందని లోలోన వారు మదన పడిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెబుతామని బ్రాహ్మణ, వైశ్య సంఘాల నాయకులు అంటున్నారు.  

Related posts

బ్లాక్ మేజిక్ అనుమానంతో వృద్ధురాలిని కొట్టి చంపిన గ్రామస్థులు

Satyam NEWS

టీటీడీ చైర్మన్‌ భూమనపై ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS

జగన్ పాలనలో రాష్ట్ర భవిష్యత్ అంధకారం

Bhavani

Leave a Comment