26.7 C
Hyderabad
April 27, 2024 09: 44 AM
Slider కడప

జగన్ పాలనలో రాష్ట్ర భవిష్యత్ అంధకారం

#SrinivasaReddy

“ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి “పోరాటంలో చంద్రబాబు తో భాగస్వాములయ్యి చేయి చేయి కలిపి నూతనాధ్యాయానికి శ్రీకారం చుట్టాలని పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటనలో కోరారు.

మూడున్నరేళ్ల పాలనలో ఒక్క ఛాన్స్ అంటూ అరాచకపు పాలనతో రాష్ట్రాన్ని చిమ్మచీకట్లలోకి నెట్టి వికృత క్రీడకు తెరలేపారని “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంతో ” తిరిగి తెలుగుదేశం పార్టీ తోనే మన రాష్ట్ర పురోగతి అని యావత్ రాష్ట్ర ప్రజానీకం ఒక్కసారి ఆలోచన చేయాలని కోరారు.

9261292612 నంబరుకు మిస్ కాల్ ఇవ్వటంతో మీ సమస్యలను తెలుగుదేశం పార్టీ దృష్టికి తెచ్చిన వారవుతారని అన్నారు. ఎందుకంటే రాష్ట్రం లో నేడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పరిశ్రమలు, పెట్టుబడులు లేవని అన్నారు.

ఉన్న పరిశ్రమలు జగన్ రెడ్డి కమిషన్ కి భయపడి పారిపోయాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు,పరిశ్రమలు లేక రాష్ట్రానికి ఆదాయం పడిపోయిందన్నారు.

అన్న క్యాంటీన్లు మూసేసి పేదవాడి కడుపు కొట్టరు,పేదవారికి పండగ కానుకలు లేకపోవడం, రైతులు దగ్గర ప్రభుత్వం కొనిన ధాన్యానికి ఇంతవరకు సొమ్ము చెలించకపోవడం దారుణం అన్నారు.

కౌలు రైతుల పరిస్థితి దారుణంగా తయారు అయిందన్నారు.రైతుకు సబ్సిడీ తో కూడిన సాయం అందకపోవడం,రైతులకు పంటల ధరలు పడిపోతే ప్రభుత్వం అదుకోలేదని ఇది రైతుల దగా ప్రభుత్వం అని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు చాలా వరకూ ఆగిపోయాయని ఆయన గుర్తు చేశారు.

రౌడీ రాజ్యం, పోలీసు రాజ్యం బీసీ,ఎస్ సి,ఎస్ టి,మైనార్టీ, కాపు కార్పొరేషన్లు సహా అనేక కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరు ఆగిపోయిందన్నారు. ముఖ్య మంత్రి జగన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేరని. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరగడం లేదు , కోర్టుల్లో రోజూ మొట్టికాయలు తింటూ రాష్ట్రం పరువు తీసుకొనే పరిస్థితి వచ్చింది.

జగన్ రెడ్డి తప్పులను ప్రశ్నించే ప్రజల పైనే దాడులు చేయించడం, మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోవడం, ప్రతిపక్ష పార్టీల పై అక్రమ కేసులు పెట్టి జగన్ ప్రభుత్వం వేధిస్తుందన్నారు…

ప్రతిపక్ష నాయకులను బూతులతో దూషించడం, సాక్షాత్తు వైసిపి మంత్రులు, పార్లమెంటు సభ్యులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, ఇటువంటి ఇబ్బందులు అన్ని తొలగి రామ రాజ్యం రావాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి, రాష్ట్రానికి పట్టిన జగన్ రెడ్డి దరిద్రాన్ని,ఖర్మని వదిలించాలని ఆయన కోరారు…

తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని, రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన అవసరం ప్రజల చేతుల్లోనే ఉందని, ప్రజలు ఆలోచించాలని శ్రీనివాస రెడ్డి కోరారు.

Related posts

ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

Satyam NEWS

ఢిల్లీ నుండి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టండి

Satyam NEWS

దళారుల మోసాలు అరికట్టి ఆయిల్ పామ్ రైతులను ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment