Slider ఆంధ్రప్రదేశ్

రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్: పేర్లు ఇవిగో

Buggana-Rajendranath-Reddy-2

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం కన్ఫర్మ్ చేసింది. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరగలేదని ఇంత కాలం చెబుతూ వచ్చిన తెలుగుదేశం పార్టీ దమ్ముంటే పేర్లు బయటపెట్టాలని ఛాలెంజ్ చేసింది. దాంతో ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడిన వారి వివరాలను రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బయటపెట్టారు.

చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ రాజధాని ప్రాంతంలో 14 ఎకరాలను కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు. టిడిపి నేతలు మాజీ మంత్రి నారాయణ, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ముఖ్య నాయకులు కేశవ్, కొమ్మాలపాటి శ్రీధర్, వేమూరి రవికుమార్, (లోకేష్ కు సమీప వ్యక్తి), చంద్రబాబుకు సన్నిహిత వ్యక్తి లింగమనేని రమేష్ భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారని ఆయన వెల్లడించారు.

అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వారు, నెల్లూరు అనంతపురం తదితర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మారుమూల గ్రామాలలో భూములు ఎలా కొన్నారని ఆయన ప్రశ్నించారు. ఇతరులందరినీ నూజివీడు, తదితర ప్రాంతాలలో రాజదాని వస్తుందని ప్రచారం చేసి చంద్రబాబు సన్నిహితులు మాత్రం ఇక్కడ కొనుగోలు చేశారని ఆయన అన్నారు.

దీన్నే ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటారని మంత్రి తెలిపారు. వీరే కాకుండా టిటిడి చైర్మన్ గా పని చేసిన పుట్టా సుధాకర్ యాదవ్, అప్పటిలో స్పీకర్ గా పని చేసిన కోడెల శివప్రసాదరావు, ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి తదితరులు నాలుగు వేల ఎకరాలు కొనుగోలు చేశారని మంత్రి తెలిపారు.

ఏపి రాజధాని పేరుతో బాగుబడింది కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని మంత్రి అన్నారు. లింగమనేని బృందం ఐదు వందల ఎకరాలు కొనుగోలుచేసిందని ఆయన అన్నారు. బాలకృష్ణ వియ్యంకుడు విబిసి రామారావు కూడా రాజధాని వల్ల లబ్ది పొందారని మంత్రి వెల్లడించారు.

Related posts

ఇండియా జింబాబ్వే టూర్ T20 ప్రసార హక్కులు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ కు

Satyam NEWS

రేషన్ కార్డు లేని జర్నలిస్టులందరికీ ఉచిత రేషన్

Satyam NEWS

13 అడుగుల కొండచిలువ హల్ చల్

Murali Krishna

Leave a Comment

error: Content is protected !!