ములుగు జిల్లా కలెక్టర్ స్వచ్ఛతా హీ సేవా గోడ పత్రిక ను ఆవిష్కరణ చేసారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు నుండి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామపంచాయతీలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు 15 రోజుల పాటు నిర్వహించవలసి ఉంటుందని జిల్లా కలెక్టర్ అన్నారు.
గ్రామాలలో పారిశుద్ద పన్నులలో భాగంగా ప్లాస్టిక్, మురుగు నీటి కాలువలు, రోడ్లు, మంచినీటి బావులు, మంచినీటి నాలాల వద్ద మురుగు నీరు నిలువ లేకుండా శుభ్రంగా ఉండేలా చూడాలని ప్రతి రోజు ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతి గ్రామ పంచాయితీ సిబ్బంది కృషి చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ నాగ పద్మజ, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, ములుగు ఎంపీడీవో ఇక్బాల్, ఏపీవో రాజు, , కలెక్టరేట్ ఏ ఓ ప్రసాద్, స్వచ్ఛభారత్ మిషన్ కోఆర్డినేటర్ నిషా పాల్గొన్నారు.