ఉన్నత నైపుణ్య శిక్షణగా స్కిల్ డెవలప్మెంట్ పథకం ద్వారా అనేకమంది విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతుల నిర్వహించిన నాటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేయడాన్ని మచిలీపట్నం విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో విద్యార్ది లోకం నేడు కదం తొక్కింది.
తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసేది ఒక్క నారా చంద్రబాబునాయుడు అని అలాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని విద్యార్థులు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ పథకం ఒక స్కామ్ అని అభూత కల్పనతో ఎంతోమంది విద్యార్థులకు జగన్ ద్రోహం చేశాడని అన్నారు. ఎంతో మంది విద్యార్ధుల అభివృద్ధికి పాటుపడిన వ్యక్తిని స్కామ్ చేశారంటూ తప్పుడు కేసులు పెట్టడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని అన్నారు.
మచిలీపట్నం రైలుపేట సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి నారా చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తక్షణమే న్యాయం జరగాలని నినదించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఎందరో విద్యార్థులకు అండగా నిలిచిన స్కిల్ డెవలప్మెంట్ పథకాన్ని స్కామ్ గా చూపించి తమ అధినేత చంద్రబాబు నాయుడు ని అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు.
కానీ ప్రజలంతా గమనిస్తున్నారు లబ్ధి పొందిన ప్రతి ఒక్క విద్యార్థి ఈ రోజు పెద్ద యెత్తున రోడ్డుపైకి వచ్చి అవసరమైతే ఆ డబ్బులును మేమే కడతావని తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారు అని ఆయన తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గ తెలుగు యువత మరియు TNSF ఆధ్వర్యంలో విద్యార్థులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు.