31.2 C
Hyderabad
May 3, 2024 00: 37 AM
Slider ప్రపంచం

వార్నింగ్:అమెరికా ప్రతీకారం తీర్చుకుంటే ఇజ్రాయిల్ ఖతం

Irak warning

ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడితో పశ్చిమ ఆసియా మరోసారి ఉద్రిక్తతకు గురైంది. ఇరాన్ ఖాదుస్ ఫోర్స్ అధినేత ఖాసిమ్ సులైమాన్ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ మరోసారి దాడి చేసింది.  ఇరాక్‌లోని రెండు అమెరికా వ్యూహాత్మక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడుల తరువాత అమెరికా ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంటుందోనని ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. 

అయితే అమెరికా ప్రతీకారం తీర్చుకుంటే దుబాయ్, ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ అధికారిక టెలివిజన్ ఛానల్ తో బాటు అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఎ ఈ విషయాలను వెల్లడించాయి. ఇరాక్ పర్యటనపై భారత విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారతీయులు ఎవరూ ఇరాక్ పర్యటనకు వెళ్లవద్దని అది సురక్షితమైన ప్రదేశం కాదని ప్రకటన జారీ చేశారు.

ఇరాన్ క్షిపణి దాడుల తరువాత గల్ఫ్‌ వైపునకు  అనేక విమానాలను మళ్లించారు. ఇరాక్, ఇరాన్, పెర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ వంటి దేశాల గగనతలంలోకి ప్రవేశించకుండా ఉండాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ యుఎస్ విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

Related posts

ట్రాజెడీ: మానేరు వంతెనపై నుంచి పడ్డ కానిస్టేబుల్ మృతి

Satyam NEWS

క‌రోనా ఎఫెక్ట్: పైడితల్లి అమ్మ‌వారి పండుగ‌పై పోలీసు శాఖ ఆంక్ష‌లు….!

Satyam NEWS

అయోధ్య తీర్పు నేపథ్యంలో నాలుగు అంచెల భద్రత

Satyam NEWS

Leave a Comment