36.2 C
Hyderabad
May 8, 2024 18: 45 PM
Slider గుంటూరు

ఇర్రెగ్యులారిటీ: అర్హులకు దక్కని ఇళ్ల స్థలాలు

#House Sites

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించాలని ఒక మంచి ఆలోచనతో పథకాన్ని రూపొందించింది. అయితే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కొనసాగకుండా గుంటూరు జిల్లా నకరికల్లు గ్రామ రెవెన్యూ అధికారి తమకు ఇష్టానుసారంగా ఇళ్ల స్థలాలను కేటాయిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

గతంలో కూడా  ఇళ్ల స్థలాల విషయంలో అవకతవకలు జరిగినట్లుగా సమాచారం ఉంది. కొందరి దగ్గర ముడుపులు తీసుకుని వారికి ఇళ్ల స్థలాలు కేటాయించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మరొక విషయం ఏమిటి అంటే గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి కూడా ఇప్పుడు మరలా ఇళ్ల స్థలాలు కేటాయించటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

నిజంగా అర్హులైన వారికి మాత్రం ఇప్పటికి కూడా కేటాయించలేదు. ఇళ్ల స్థలాల విషయంలో మరొకసారి పరిశీలించి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను కేటాయించవలసిందిగా ప్రజాప్రతినిధుల్ని, ఉన్నతాధికారుల్ని నకరికల్లు ప్రజలు కోరుతున్నారు.

ఇళ్ల స్థలాల విషయంలో గ్రామ రెవెన్యూ అధికారి అవకతవకలకు పాల్పడ్డారని, వాటిని మరొకసారి పూర్తిగా విచారించి ఇళ్ల స్థలాలను కేటాయించాలని, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. నకరికల్లు గ్రామ రెవెన్యూ అధికారి కేటాయించిన ఇళ్ల స్థలాలు పూర్తిస్థాయి దర్యాప్తు చేయవలసిందిగా గ్రామస్తులు ఉన్నతాధికారుల్ని కోరుకుంటున్నారు.

నకరికల్లు రెవెన్యూ అధికారి అతనికి ఇష్టం వచ్చిన వారికి ప్రభుత్వ స్థలాలు కేటాయించటమే కాకుండా ప్రభుత్వ సాగు భూములు కూడా కేటాయించారు. ప్రభుత్వ ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఈ రెవెన్యూ అధికారి పై తక్షణమే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు  కోరుతున్నారు.

Related posts

ఏపీలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

Satyam NEWS

భక్తి భావనతో దైవానుగ్రహం పొందవచ్చు

Satyam NEWS

పురుగుల మందు తాగి మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment