26.7 C
Hyderabad
May 3, 2024 10: 40 AM
Slider కవి ప్రపంచం

ఆశల తొలకరి

#VVS Krishnakumari

రోళ్ళు పగిలే రోహిణి నుంచి

ముసురు పట్టే మృగశిర వచ్చింది

ముంగిట్లు చల్లబడ్డాయి

ముసలి ఎద్దు రంకె వేసిందో

లేదో తెలీదుగానీ

బక్క చిక్కిన రైతన్నల గుండెల్లో

మాత్రం చిరు ఆశలు చిగురించాయి

ఇన్నాళ్లు చూపంతా ఆకాశం వైపే

తొలకరి కోసం ఎదురు చూపులు

చినుకు రాలితేనే

దుక్కి దున్ని విత్తులు వేసేది

ఎదురు చూపులకు

ఫలితం దక్కింది

తొలకరి పలకరించింది

మట్టి వాసన, ముసురు పట్టిన ఆకాశం

అన్నదాత గుండెల్లో

చీకట్లను తొలగించింది

కళ్ళల్లో కోటి కాంతులు

దాహంతో నోరు తెరచుకొన్న

పుడమి మెత్తబడి,సాగుకు

సిద్ధమని పిలుపు నిచ్చింది

చద్దన్నం మూట కట్టుకుని

హలం పట్టి పొలం పోయి

దుక్కి దున్ని, వానచినుకుల్లో

తడిసి ముద్దవుతూ

విత్తు విత్తు నాటుతున్నా

గుండెలో గుబులే

ప్రతి యేటా ఉండే భాగోతమే

ఈ సంబరం మూన్నాళ్ళ

ముచ్చట అవుతదా

తొలకరి ఆనందాన్ని ఇస్తుందా

లేక అతివృష్టి అనావృష్టి తో

కడగండ్లను మిగులుస్తుందా

ముందు ముందు ఏదైతే ఏంటి

ఆశల్లో బతికే రైతన్నకు

ఇప్పటికిదే ఆనందం

ఆశలు తొలకరి

పీ.వీ.యస్.కృష్ణ కుమారి, తుర్కయాంజాల్

Related posts

కరోనా నియంత్రణకు పటిష్టంగా కర్ఫ్యూ: జీఓతో పోలీసు శాఖ అలెర్ట్

Satyam NEWS

గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ

Satyam NEWS

మెడికల్ కాలేజీకి చెందిన భూమి అన్యాక్రాంతం

Satyam NEWS

Leave a Comment