40.2 C
Hyderabad
May 6, 2024 15: 49 PM
Slider ఆంధ్రప్రదేశ్

మోడీ మన్ కీ బాత్ విన్నారా వైసీపీ నేతలూ

manki bath

మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ వెలిబుచ్చిన అభిప్రాయాలతో ఏపిలో అధికారంలో ఉన్న వైసిపి నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమ్మ భాషను విస్మరిస్తే అభివృద్ధి అసాధ్యం అంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఐక్యరాజ్యసమితి కూడా మాతృ భాషల ప్రాధాన్యతను గుర్తించిందని ఆయన ఆ కార్యక్రమంలో అన్నారు. ఈ ఏడాదిని అంతర్జాతీయ స్థానిక భాషల సంవత్సరంగా ప్రకటించిందని కూడా ఆయన గుర్తు చేశారు. శతాబ్దాలుగా మన దేశంలో వందలాది భాషలు వికసించాయని వీటన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. ఈరోజు నుంచే మీ భాష, మీ యాసను ఉపయోగించడం ప్రారంభించండని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ, అంతర్జాతీయ భాషల సంవత్సరం సందర్భాన, మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రస్తావించింది విన్న జగన్ రెడ్డిగారు, మిగతా వైసీపీ సమూహం ఎలా స్పందిస్తారో విందామని వేచి చూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ప్రాథమిక విద్య స్థాయిలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టాలనుకున్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని పవన్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎవరికి ఇష్టమైన మీడియంలో వారు చదువుకునేలా విద్యార్థులకు వెసులుబాటు ఉండాలని ఆయన సూచిస్తున్నారు.

Related posts

చిలుకూరులో నిరాడంబరంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

హూ ఈజ్ ద విలన్: స్కూళ్లలో పోలీసులు ఆరుబయట విద్యార్ధులు

Satyam NEWS

బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో అయ్యప్ప మహపడిపూజ

Satyam NEWS

Leave a Comment