31.7 C
Hyderabad
May 2, 2024 08: 08 AM
Slider నల్గొండ

నల్లగొండ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

#Babu Jagjeevan Ram Jayanti

బాబు జగ్జీవన్ రామ్ ను ఓ ఒక్కరికో పరిమితము చేయొద్దని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూచించారు. నవ భారత నిర్మాణంలో ఆయన ఒక శిల్పి అని ఆయన కొనియాడారు. దివంగత బాబు జగ్జీవన్ రాం 116 వ జయంతిని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా రూపొందించిన బాబు జగ్జీవన్ రామ్ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు.

జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,స్థానిక శాసన సభ్యులు కంచర్ల కృష్ణారెడ్డి,మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్రా సుధాకర్,కవి,రచయిత విశ్రాంత ఇంజినీర్ దున్న యాదగిరి యస్ పి అపూర్వ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఆయన స్ఫూర్తి దేశానికి మార్గదర్శనం అయ్యిందన్నారు.

అటువంటి చిరస్మరణీయుల చరిత్ర వర్తమానానినికి అందించాల్సిన ఆవశ్యకత ను ఆయన వివరించారు. చదువుతోటే పురోగతి సాధ్యం అని మొదట గుర్తించింది పూలే అని ఆయన గుర్తుచేశారు. చదువు లేక పోవడంతో తో పాటు కులాల పునాదుల మీద నిర్మాణం జరిగిన భారతదేశం మీదకు వైశాల్యంలో గాని,జనాభా పరంగా గాని నూరో వంతు కుడా లేని దేశాలు దండయాత్ర సాగించయన్నారు.అటువంటి విపత్కర పరిస్థితులను అధిగమించి ఉన్నతి కేగిన రత్నాలలో బాబు జగ్జీవన్ రామ్ ఒకరు అని ఆయన కొనియాడారు.

Related posts

సెక్స్ రాకెట్ గుట్టు దాచేందుకే బిజెపి నేత శ్వేతను హతమార్చిన భర్త

Satyam NEWS

తెలంగాణాలో షర్మిలను ఆదరిస్తారా ! కాదు పొమ్మంటారా ?

Satyam NEWS

తమ్మినేని హత్యకేసులో 9మందికి బెయిల్  

Murali Krishna

Leave a Comment