39.2 C
Hyderabad
April 30, 2024 20: 29 PM
Slider వరంగల్

రీసౌండ్ ఆఫ్ రెబెల్స్: అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి

janagan

అనుకున్నదొక్కటి… అయ్యిందివొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా అన్నట్లుగా జనగామ మున్సిపల్ ఎన్నికల

ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ కు భంగపాటు తప్పలేదు. ఇక నాలుగు వార్డుల్లో సిపియం, మూడు వార్డుల్లో సిపిఐ, 13 వార్డుల్లో తెలుగుదేశం పార్టీలు పోటీ చేయగా వారికి ప్రజల

మద్దతు లభించలేదు.

సిపియం రెండు వార్డుల్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికి ఓటమి పాలైంది. జనగామ జిల్లాలోని ఏకైక మున్సిపాలిటి జనగామలో మెత్తం 30 వార్డులకు గాను 168 మంది బరిలో ఉన్నారు. అధికార టిఆర్ఎస్ పార్టీ 30 వార్డుల్లో అభ్యర్థులను బరిలో ఉంచగా టికెట్టు ఆశించి భంగపడిన నాయకులు తిరుగుబాటు అభ్యర్థులుగా దాదాపు 24 వార్డుల్లో బరిలో నిలవడంతో అధికార పార్టీ నాయకులు తలలు పట్టుకున్నారు.

కాంగ్రెస్ 30 వార్డుల్లో అభ్యర్థులను బరిలో ఉంచినప్పటికి తిరుగుబాటు అభ్యర్థుల బెడద తప్పలేదు. టిపిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల వర్గానికి అశించిన స్థాయిలో టికెట్లు దక్కక పోవడంతో ఈ ఎన్నికల్లో వారు కొంతమంది ప్రచారానికి దూరంగా ఉన్నారు. తిరుగుబాటు అభ్యర్థులను విరమింపచేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడంతో వీరి గెలుపు ఇబ్బందిగా మారింది. రాజకీయ విశ్లేషకులు ముందుగా భావించినట్లుగా ఏ పార్టీకి మెజారిటీ రానుందున హంగ్ ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి.

శనివారం ప్రకటించిన 30 వార్డుల ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ 13, కాంగ్రెస్ 10, బిజెపి 4, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు ఎన్నికైనారు. మున్సిపల్ చైర్మెన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా పావులు కదుపుతున్నారు. క్యాంపు రాజకీయాలకు తెరలేపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒక దశలో కాంగ్రెస్, బిజెపి కలిసి చైర్మెన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులను తమ శిబిరంలో చేర్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

స్థానిక శాసన సభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నేతృత్వంలో మున్సిపల్ చైర్మెన్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు ప్రచారం ఉంది. టిఆఎస్ తిరుగుబాటు అభ్యర్థులుగా 5వ వార్డు నుండి దేవరాయ నాగరాజు, 29వవార్డు నుండి ముస్త్యాల దయాకర్, 10వ వార్డు నుండి నీల లక్ష్మీ రామ్మోహన్ విజయం సాధించడంతో వీరి ఓట్లు కీలకం కానున్నాయి అధికార టీఆర్ఎస్ స్వతంత్ర అభ్యర్థులను తమ క్యాంపుకు తరలిస్తే చైర్మన్ పీఠాన్ని సునాయాసంగా దక్కించుకోవచ్చు.

అలాకాకుండా స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ బిజెపి కూటమికి సహకరిస్తే కాంగ్రెస్ బిజెపి చైర్మన్ పదవిని చేపట్టవచ్చు. వెలువడిన ఫలితాల్లో ఏ పార్టీకి చైర్మన్ పదవిని చేపట్టడానికి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో టిఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందిన అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. తమను గుర్తించకుండా టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా దూరం పెట్టినప్పటికీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సహచరులుగా, టిఆర్ఎస్ పార్టీ అభిమానులుగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి టిఆర్ఎస్ కె చైర్మన్ పదవి కట్ట పెడతారని స్థానిక తెరాస నాయకులు చర్చించుకుంటున్నారు.

అంతేకాక మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి అని నిర్ణయించేది కూడా స్వతంత్ర అభ్యర్థులు అని వారు ఏ పార్టీకి మద్దతు తెలుపుతూ ఆ పార్టీ చైర్మన్ పదవిని దక్కించుకుంటుంది. ఏది ఏమైనప్పటికీ ఉత్కంఠభరితంగా నరాలు తెగేలా సాగిన లెక్కింపు ప్రక్రియ అనంతరం ఏ పార్టీ చైర్మన్ పదవి దక్కించుకుంటుంది అన్ని జిల్లాలో ఆసక్తికరమైన చర్చగా జరుగుతుంది.

Related posts

మున్సిపాలిటీ పారిశుద్ధ్య వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

Satyam NEWS

రఘురామ వ్యవహారంలో లోక్ సభ స్పీకర్ జోక్యం చేసుకోవాలి

Satyam NEWS

టెక్ టిప్స్:గుంపుగావచ్చిపంజాగుట్ట లలిత జువెల్లరీలో చోరీ

Satyam NEWS

Leave a Comment