38.2 C
Hyderabad
May 3, 2024 19: 22 PM
Slider విశాఖపట్నం

శారదా పీఠం భూములు కబ్జా పై విచారణ జరపాలి

#saradapeetham

జగన్  ప్రభుత్వం ఇచ్చిన రూ.250 కోట్ల విలువైన భూములను రద్దు చేయాలి

అన్యాయాలు, భూ లావాదేవీలు,  నిబంధనల ఉల్లంఘనలకు కేరాఫ్ అడ్రస్ అయిన స్వయం ప్రకటిత పీఠాధిపతి స్వరూపానందేంద్ర   సరస్వతి  అక్రమాలకు అడ్డే లేకుండా పోతుందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు.  క్రైస్తవుడైన వైయస్ జగన్ ను హిందువుగా చూపించి హిందువుల ఓట్లు వేయించినందుకు కానుక గా రాష్ట్ర ప్రభుత్వం స్వామికి 250 కోట్ల రూపాయల విలువైన చేసే 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టిందని ఆయన అన్నారు.

జీవీఎంసీ నాలుగో వార్డ్ పరిధిలోకి వచ్చే భీమునిపట్నం కి  అనుకొని ఉన్న సర్వే నెంబర్ 102 /2 లో 7.70 ఎకరాలు 103 లో 7:30 ఎకరాలు కేవలం 15 లక్షల రూపాయలకు కానుకగా సమర్పించింది. అంతటి ఆగకుండా విశాఖ వి ఎం ఆర్ డి ఏ ను రంగంలోకి దింపి స్వామి కోసం రెండు కోట్ల రూపాయల రహదారిని నిర్మింపచేసింది.  ఇంతా  చేసిన తర్వాత వేద పాఠశాల, ఆధ్యాత్మిక సేవలు పేరుతో తీసుకున్న ఈ  భూములను వ్యాపారం చేసుకునేందుకు  అవకాశం ఇవ్వాలని శారదా పీఠం దరఖాస్తు చేసింది.

అంటే శారదా పీఠం ఉద్దేశం కేవలం వ్యాపారమే. వ్యాపారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెందిన 250 కోట్ల రూపాయల ఆస్తులను శారదా పీఠానికి కట్టబెట్టడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధం.  ఈ భూ కేటాయింపులను వెంటనే రద్దుచేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకోవాలి. నకిలీ స్వామిగా, దొంగ స్వామిగా , ఖై నీ  స్వామి గా పేరుగాంచిన శారదా పీఠాధిపతి చేతులలో  ఉన్న భూములను జగనన్న కాలనీగా మార్చి పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పని చేయకుండా పీఠాలు,  మతాధికారులు కోసం పని చేయటం రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్ధం. శారదా పీఠం, సెయింట్ లుక్స్  సంస్థల చేతుల్లో 500 కోట్ల రూపాయల కు పైగా విలువచేసే భూములు నగర పరిధిలో ఉన్నాయి. ఈ రెంటిని వెంటనే స్వాధీనం చేసుకొని ప్రజా అవసరాలకు ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు.

వేద పాఠశాల, ఆధ్యాత్మిక సేవ పేరుతో భీమునిపట్నం లో భూములు తీసుకున్న నకిలీ స్వామి స్వరూపానంద ఇప్పుడు అందులో వ్యాపారం చేస్తా అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేయడం, అది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా ముఖ్యమంత్రి ఒత్తిడితో అధికారులు ఫైలు సిద్ధం చేయడం దారుణం. శారదా పీఠం , సెయింట్ లూక్స్ సంస్థల కేటాయింపుల్లో వైఎస్సార్ కుటుంబం ప్రమేయం వున్నందున ఇందులో వారికి కూడా వాటాలు ఉన్నాయని అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ రెండు సంస్థల కేటాయింపులను రద్దుచేసి, భవిష్యత్తులో  ఈ తరహా సంస్థలకు భూ కేటాయింపులు జరగకుండా చట్టం చేయాలని కోరుతున్నాం. విశాఖపట్నం వదిలి  హైదరాబాద్ వెళ్ళిపోతాను అన్న స్వరూపానందేంద్ర స్వామికి విశాఖలో 15 ఎకరాల భూమి ఎందుకో  ప్రభుత్వ పెద్దలే చెప్పాలి అని ఆయన అన్నారు. జనం చందాలు వేసి కట్టుకొన్న సీతమ్మ ధార సాయిబాబా ఆలయం, మురళీ నగర్ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాల కబ్జా కు స్వరూపానందేంద్ర ప్రయత్నం చేసిన మాట నిజం కాదా? విశాఖపట్నం పెద వాల్తేరు వెంకటేశ్వర స్వామి ఆలయం కబ్జా కు యత్నించారు.

తాన పరిధిలో ఆలయాలు లేని బోగస్ పీఠాధిపతి కావడం వల్లే స్వరూపానందేంద్ర ఈ ప్రయత్నాలు చేశారు. చేస్తున్నారు. శాస్త్రం, వేదాలు , మంత్రాలు రాని ఈ స్వామి పై పూర్తి స్ధాయిలో విచారణ జరపాలి అని డిమాండ్ చేస్తున్నమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త పి వి స్ న్ రాజు, ప్రాంతీయ సమన్వయకర్తలు నాగలక్ష్మి చౌదరి, త్రివేణి, కిరణప్రసాద్ పాల్గొన్నారు.

Related posts

ప్రేమించి మోసపోయిన యువతి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

24 గంటల వ్యవధిలో 50 మంది మృతి

Bhavani

అంత్యక్రియలు తెచ్చిన కరోనా టెస్టుల తంటా

Satyam NEWS

Leave a Comment