38.2 C
Hyderabad
April 28, 2024 19: 34 PM
Slider ముఖ్యంశాలు

పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రం

#ministersridharbabu

జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు వరుస భేటీలు

పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ అనువైన రాష్ట్రమని, కాబట్టి తెలంగాణలో పెట్టబడులు పెట్టడానికి ముందుకురావాలని పలు బహుళజాతి కంపెనీలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. పెట్టబడులు సాధనలో భాగంగా సౌదీ అరెబియాలో పర్యటిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం నాడు  జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో రాత్రి వరకు వరుస సమావేశాల్లో పాల్గొన్నారు.

సౌదీ యువరాజు ప్రత్యేక కార్యాలయపు జనరల్ డైరెక్టర్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ రాయెస్ తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యి తెలంగాణ విధానాలు, ఐటీ పరిశ్రమకు సహకారం అందించడం వంటి అంశాలపై వివరించారు. సౌదీ కంపెనీలు తెలంగాణలు పెట్టబడులు పెట్టేలా చొరువ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఆరాంకో సంస్థ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశాలపై చర్చలు జరిపారు. ఆ సంస్థ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అన్ని రకాల మద్ధతిస్తామని  హామీ ఇచ్చారు. అరాంకో కంపెనీ రసాయనాలు, ఇంధన రంగాలకు సంబంధించి అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థగా పేరుపొందింది. అలాగే, ఆల్ షరీఫ్ గ్రూప్ హోల్డింగ్స్ సంస్థ సీఈవో ఆల్ షరీఫ్ నవాబ్ బిన్ ఫైజ్ బిన్ అబ్దుల్ హకీమ్, ఎగ్జిగ్యూటివ్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ ఇంజనీర్ సులైమన్ కే తో సమావేశమయ్యి పెట్టుబడులపై మాట్లాడారు.

ఈ సంస్థ విద్యుత్తు, హాస్పెటాలిటీ, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, ఆవిష్కరణ రంగంలో అగ్రగామిగా ఉంది. కాగా, ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ సెడ్కో కేపిటల్స్ ప్రతినిధులతో, జెడ్డా ఛాంబర్స్ తో, ఆహార ఉత్పత్తుల దిగ్గజ సంస్థ అయిన సవోలా గ్రూప్ సీఈవో వలీద్ ఫతానాతో, సౌదీ బ్రదర్స్ కమర్షియల్ కంపెనీ సీఈవో, బోర్డ్ సభ్యులతో పెట్రోమిన్ కార్పోరేషన్ ప్రతినిధులతో, బట్టర్జీ హోల్డింగ్ కంపెనీ చైర్మన్ మాజెన్ బెట్టర్జీతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు.

రాష్ట్రంలో పెట్టబడులు పెట్టడానికి గానూ ఉన్న అనువైన పరిస్థితుల గురించి మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు కల్పించే రాయితీలు, ప్రోత్సాహకాల వంటి విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో నిరంతర విద్యుత్తు సరఫరా, పుష్కలమైన నీటి లభ్యత, నాణ్యమైన మానవ వనరులు, మంచి మౌలిక సదుపాయాలు, మెరుగైన కనెక్టివిటీ  ఉన్నాయని మంత్రి చెప్పారు. కాగా, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ఆసక్తి కనబర్చాయి. అనేక సంస్థలు సానుకూలంగా స్పందించాయి.

మంత్రి శ్రీధర్ బాబు వెంట రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ అండ్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి ఉన్నారు.

Related posts

శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న కొల్లాపూర్ సేవా సమితి చైర్మన్ రంగినేని

Satyam NEWS

మహిళ

Satyam NEWS

రాయలసీమకు ద్రోహం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్

Satyam NEWS

Leave a Comment