33.7 C
Hyderabad
April 29, 2024 02: 48 AM
Slider ముఖ్యంశాలు

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని గాంధీ విగ్రహం వద్ద నిరసన

#uppal

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ  టీయుడబ్ల్యూజె, ఐజెయు  పిలుపు మేరకు శనివారం నాడు ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో  ఉప్పల్ మున్సిపల్ కార్యాలయం వద్ద గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు ఉప్పల్ ప్రెస్ క్లబ్లో మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని ప్రెస్ క్లబ్ సభ్యులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా  నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విఫలం అయ్యాయని విమర్శించారు. జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, అరోగ్య పరమైన భద్రతా కల్పించడం లేదని వాపోయారు.   జర్నలిస్టులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించకుండా నిర్లక్ష్యం చేయడం జరుగుతుందని తద్వారా అనేక మంది జర్నలిస్టులు విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం కోల్పోయారని వారి కుటుంబాలను అందుకోవడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష్య పూరితమైన వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు.

ఈ నిరసన కార్యక్రమంతోనైన ప్రభుత్వాలు తమ కండ్లు తెరుచుకుని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతుల వెంకట్రాం రెడ్డి, ప్రధాన కార్యదర్శి కూకుట్ల నరోత్తం రెడ్డి, కార్యనిర్వాహణ అధ్యక్షులు వేముల తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు మాదిరాజ్ సురేష్ కుమార్, పారెల్లి సాగర్, కార్యదర్శులు అశోక్, శేఖర్, కోశాధికారి యాదగిరి, ముఖ్య సలహాదారులు చంద్రమౌళి, కంచు శ్రీనివాస్, పల్లా మహేందర్ రెడ్డి, శ్రీశైలం, శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ వడ్డేపల్లి  కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మీకు ఎంత చెప్పినా అర్థం కావటం లేదంటూ మాస్క్ లు తొడిగిన ఎస్పీ…!

Satyam NEWS

మావో ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం

Satyam NEWS

డివైన్ వర్డ్: మహాభారత కావ్య పఠనం ముక్తి కి మార్గం

Satyam NEWS

Leave a Comment