31.2 C
Hyderabad
June 20, 2024 21: 12 PM
Slider ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ

మావో ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం

Amit-Shah

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై కేంద్ర హోం శాఖ నేడు సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు కాగా తెలంగాణ నుంచి హోం మంత్రి మహమూద్ అలి సమావేశానికి హాజరయ్యారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు అటవీ, పర్యావరణ అనుమతుల్లో జాప్యం లేకుండా చూడాలని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. కాంట్రాక్టర్లు ముందుకురాని చోట ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థలకు బాధ్యత అప్పగించాలని కూడా నిర్ణయించారు. మావోయిస్టు సమస్యను ఎదుర్కోవడంలో తెలుగు రాష్ట్రాలు రోల్ మోడల్‌గా నిలిచాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సందర్భంగా ప్రశంసించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితుల గురించి హోంశాఖ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సమావేశంలో మాట్లాడుతూ మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. మధ్యాహ్నం సెషన్‌లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ మహేంద్రనాథ్‌ పాల్గొన్నారు. తెలంగాణ నుంచి హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, జార్ఖండ్‌ సీఎం రఘుబర్‌ దాస్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, చత్తీస్‌గఢ్‌ సీఎం భాఘెల్‌, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, ఆయా రాష్ట్రాల డీజీపీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రూ. 50 లక్షల లోపు పనులను నామినేషన్ పద్ధతిలో స్థానిక గిరిజనులకు ఇచ్చేలా ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ పథకాలు మారుమూల ప్రాంతాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. అదే విధంగా ప్రతి గ్రామంలో పోస్టాఫీసు, బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని, నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాట్లు ద్వారా స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ టవర్ల ఏర్పాటుకు నిబంధనల సరళీకరణపై దృష్టి సారించాలని నిర్ణయించారు.

Related posts

కరోనా వేళ సంక్షేమ మార్గంలో నిర్మలమ్మ బడ్జెట్

Satyam NEWS

ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఆన్ లైన్ లో అవగాహన కార్యక్రమం

Satyam NEWS

కంఝవాలా కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి

Satyam NEWS

Leave a Comment