33.7 C
Hyderabad
April 30, 2024 00: 04 AM
Slider చిత్తూరు

వెంకటేశుడికి భక్తులకు మధ్యలో తిరుమల దేవస్థానం

TTD Journos

సమాచార సేకరణ కు వచ్చే జర్నలిస్టులపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆంక్షలు విధించడం అన్యాయమని జర్నలిస్టుల ఐక్యవేదిక అభిప్రాయపడింది. మీడియాను ఇబ్బందులకు గురి చేయడం మీడియా స్వేచ్ఛను హరించడమే నని జర్నలిస్టుల ఐక్యవేదిక నాయకులు కల్లు పల్లి సురేంద్ర రెడ్డి, కోలాలక్ష్మీపతి లు అన్నారు.

కేవలం 26 మంది జర్నలిస్టులకు మాత్రమే అనుమతించడం, మిగిలిన వారిని సమావేశం హాల్ లోనికి అనుమతించకపోవడం హేయమైన చర్యగా వారు అభివర్ణించారు. వారం రోజుల్లో టిటిడి అధికారుల తీరు మార్చుకోకుంటే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని తిరుమల తిరుపతి జర్నలిస్టుల ఐక్యవేదిక నిర్ణయించింది. తిరుమల శ్రీవారి ఆలయం, టిటిడి సంస్థలను  అధికారులు తమ సొంత జాగీరుగా భావించరాదని నాయకులు హితవు పలికారు.

టీటీడీ సంస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ, అధికారుల అవినీతి ని ఎండగడుతూ వార్తలు రాసే జర్నలిస్టులపై టీటీడీ అధికారులు ద్వేషాన్ని పెంచుకోవడం, వ్యక్తిగత కక్షలకు పూనుకోవడం, ఆర్ధిక మూలాలు దెబ్బతీసే అనైతిక చర్యలకు ఒడిగట్టడం మంచిది కాదని హెచ్చరించారు. 

టిటిడి సంస్థ ప్రతిష్ఠను కాపాడే బాధ్యత అధికారులపైనే కాకుండా జర్నలిస్టులపై కూడా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తిరుమలలో మీడియా ప్రతినిధుల పట్ల విభజించు పాలించు అనే విధంగా టీటీడీ అధికారులు కొంతమందిని మాత్రమే గుర్తించి వారికి మాత్రమే సమాచారం ఇస్తామనడం మీడియా స్వేచ్ఛను హరించడమే అని అన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని, వారం లోపు టిటిడి అధికారుల తీరు మార్చుకోకుండా ఉంటే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని జర్నలిస్టుల ఐక్యవేదిక సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో జర్నలిస్టులు కలకడ వేణుగోపాల్, శ్రీనివాసులు, ఈశ్వర్, గుణకల తిరుపాల్, ఆర్ హరిబాబు, రమేష్ స్వామి, జి.దినేష్, శేఖర్, రవీంద్ర నాథ్, గంధం ప్రభాకర్, రుద్రయ్య, బొజ్జయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

డ్రంక్ అండ్ డ్రైవ్: రెండు బైకులు ఢీ ముగ్గురికి గాయాలు

Satyam NEWS

ప్రధాన పర్యటన లో నిరసనకారులు ఘటనలో కాంగ్రెస్ కుట్ర

Satyam NEWS

బెజ‌వాడ క‌న‌క దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల‌

Satyam NEWS

Leave a Comment