అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం సహాయనిధిని మంజూరు చేయించారు. కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మూడవ వార్డుకు చెందిన కురుమయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు కు సమస్యను తెలియచేయటంతో సీఎం సహయ నిధి నుండి రూ.31,000 మంజూరు చేయించారు.
గురువారం టీఆర్ఎస్ కార్యాలయంలో మాజీమంత్రి జూపల్లి అనుచరులు, కౌన్సిలర్స్ షేక్ రహీం పాషా, శ్రీదేవి గౌతమ్ గౌడ్, మేకల శిరీష కిరణ్ యాదవ్, రమ్య నాగరాజు, బోరెల్లి కరుణ మహేష్, మాచూపల్లి బాలస్వమి, నయిం, జ్యోతి, శ్రీ లక్ష్మి బాధితుడు కురుమయ్యకు అందచేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్స్ మాట్లాడారు. జూపల్లి కృష్ణారావు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటారన్నారు. బాధితుడు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.