27.7 C
Hyderabad
April 30, 2024 09: 05 AM
Slider ప్రత్యేకం

మాజీ మంత్రి జూపల్లికి  క్రేజీ మామూలుగా లేదు

#jupally

ఒకప్పుడు రైతుల కోసం విద్యుత్ చార్జీల, సమస్యలపై అలుపెరగని పోరాటం చేసి జైలుకు వెళ్ళారు. మరోసారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవులను వదిలేసి   రాష్ట్ర సాధనకై ఉద్యమ బాటలో నడిచారు. ఆయననే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. అయనకు ప్రస్తుతం వివిధ జాతీయ పార్టీలో క్రేజీ  మామూలుగా లేదు. ఆయన వైపే పార్టీలు చూస్తున్నాట్లు కనిపిస్తుంది. కానీ కొందరు స్వార్థ నాయకులు జూపల్లిది ఏ పార్టీ అంటూ ప్రశ్నిస్తారు. కానీ జూపల్లి వైపే పార్టీలు చూస్తున్నాయని తెలుసుకోలేకపోతున్నారు.

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజక వర్గంలో ఏ పార్టీ నుంచి వచ్చే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉంటే సమర్థిస్తారు అంటూ నియోజకవర్గ ప్రజలకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. బీఆర్ఎస్  అయితే 1 నొక్కండి. కాంగ్రెస్ అయితే 2 నొక్కండి. బీజేపీ అనుకుంటే 3 నొక్కండి. ఇండిపెండెంట్గా  అయితే 4 నొక్కండి  అంటూ ఫోన్ కాల్స్ చేస్తున్నారు. మరి ఈ ఫోన్ కాల్స్ ఎవరు చేపిస్తున్నారు ? జూపల్లి కృష్ణారావు చేపిస్తున్నారా? లేక మరి ఎవరైనా వ్యక్తిగత సర్వే కోసం ఫోన్ కాల్స్ చేస్తున్నారా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతం పార్టీలో ఉండి బాధ్యతలు వహిస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నారు.

అంతేకాదు సిట్టింగ్ స్థానంలో ఉన్నవారు కూడా ఉన్నారు. మరి అలాంటి వారిని వదిలేసి జూపల్లి   వైపే ఆ పార్టీలు చూస్తున్నాయని కనిపిస్తున్నాయి.నియోజకవర్గంలో ప్రస్తుతం జూపల్లిదే పై చెయ్యి ఉన్నట్లు సమాచారం. మరి ప్రజా నిర్ణయం మేరకు   ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. తెలంగాణ ఉద్యమం కోసం  పోరాటం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధనలో జూపల్లి పాత్ర ఉంది.ఇప్పుడు ఆత్మగౌరవ తెలంగాణ కోసం ఆయన పోరాటం చేస్తున్నట్టు కనిపిస్తుంది.ప్రజల అభిప్రాయం మేరకే జూపల్లి నిర్ణయం  తీసుకునే విధంగా కనిపిస్తుంది. మొత్తానికి జూపల్లి కృష్ణారావు గత ఎన్నికల్లో ఓటమి కావడంతోనే ఆయనకు నియోజకవర్గంలో మరింత అభిమానాని  పొందినట్లు కనిపిస్తుంది.

Related posts

కమిషన్ల కక్కుర్తి వల్లే సింగరేణి ప్రమాదం

Satyam NEWS

దళిత యువకుల పై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి 

Satyam NEWS

Analysis: ఇప్పుడు వస్తున్న బర్డ్ ఫ్లూ ప్రమాదమా?

Satyam NEWS

Leave a Comment