32.2 C
Hyderabad
May 8, 2024 11: 24 AM
Slider ప్రత్యేకం

ఎమ్మెల్యేకు, పోలీసులకు మాజీ మంత్రి జూపల్లి వార్నింగ్

#jupallyKrishnarao

కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు యువకుడు కదా అని  హర్షవర్ధన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలలో గెలుపోటములు సహజం. గెలిచిన కొత్తలో హనీమూన్ సంతోషంలో ఉన్నాడు అనుకోని   ఏమి జరిగినా చూస్తూ ఉన్నాను. ఇప్పటికే మూడున్నర ఏండ్లు అయింది. ఇక పై నియోజకవర్గంలో అరాచకాలను సృష్టిస్తూ, కబ్జాలకు, అక్రమాలకు పాల్పడితే చూస్తూ  ఊరుకోను అని శుక్రవారం కొల్లాపూర్ మండల నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని  తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన వాయిస్ లో బెస్ పెంచుతూ హెచ్చరించారు.

నియోజకవర్గ పోలీసులకు జూపల్లి వార్నింగ్

నియోజకవర్గంలో ప్రశ్నించిన వ్యక్తులపై,ప్రజలపై తన అనుచరులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సీరియస్ అయ్యారు.పోలీస్ స్టేషన్ కు పిలిపించి వేధింపులు చేస్తే ఇకపై సహించని ఆయన హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ల లోపలికి మొబైల్ తీసుకురాకూడదని రూల్స్ పెట్టడం ఏంటి అని ప్రశ్నించారు.డిజిపి ముందుకు వెళ్ళినప్పుడు కూడా సెల్ ఫోన్ల అనుమతి ఉంటుందన్నారు వాట్సాప్ లో మెసేజ్ చేసిన  వారిపై , ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, కొందరిని స్టేషన్లకు  పిలిపించి వేధించడం,దాడి చేయడం,బూటు కాళ్లతో తన్నడం లాంటివి చేస్తే ఇకపై పరిణామాలు వేరే విధంగా చూడల్సి వస్తుందని హెచ్చరించారు.తప్పు చేస్తే చట్టప్రకారం శిక్షించాలి.41crp  నోటీసులు ఇచ్చి తెలియచేయాలి. అంతేగాని ఇష్టానుసారంగా చట్టాలను అడ్డుపెట్టుకొని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, అక్రమార్కులకు కొమ్ముకాస్తూ ఇలాంటివి కొనసాగిస్తే   వేల మంది ప్రజలు వచ్చి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి,ఉద్యోగం ఉడగొట్టే  వరకు వదిలి పెట్టమని ఆయన హెచ్చరించారు.

తల్లి బిడ్డను కడుపులో పెట్టుకున్నట్లు చూసుకుంటా

శుక్రవారం పట్టణ  సమీపంలోని   చిన్న తోటలో కొల్లాపూర్ మండలానికి చెందిన తన అనుచరులతో  జూపల్లి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ మారుతున్నారని జరుగుతున్న  ప్రచారంపై క్లారిటి ఇచ్చారు. ముందుగా తన అనుచరులు మాట్లాడారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై కసితో రగిలిపోతూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. మీ నిర్ణయానికి కట్టుబడి వుంటామని ఈ అరాచకం అంతమొందించాలని  అనుచరులు తెలియజేశారు. అనంతరం జూపల్లి మాట్లాడారు. నా  ఇరవై మూడేళ్ల  రాజకీయా జీవితంలో నాకు తోడుగా, అండగా ఉన్నా మి కోసం నేను ఉంటానని, మిమ్మల్ని కాపాడుకుంటానని జూపల్లి అన్నారు. ఈ సందర్భంగా కంగారు, కోతి కథ చెప్పారు.కంగారు తన పిల్లలను కడుపులో పెట్టుకొని రెండు కాళ్ళ మీద నిలబడుతుంది.తన పిల్లల్ని కాపాడుకుంటుంది. పిల్లలకు రక్షణ కల్పిస్తుంది.అలాగే నన్ను  నమ్ముకున్న వారి కోసమే ఇంకా ఉన్నాని, రాజకీయం చేస్తున్నానని, అండగా ఉంటానని ఆయన చెప్పారు. ఈ తొమ్మిది నెలలు చాలా కీలకమన్నారు.ఇప్పుడు అరాచకాలకు పాల్పడుతున్న వారికి  బరాబర్ బదులు ఇస్తానని, ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఉదయం పట్టణంలో వందల మంది అనుచరులతో మార్నింగ్ వాక్ చేశారు.

కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి హనుమంతు నాయక్, మాజీ సర్పంచ్ మేకల నాగరాజు, సింగిల్ విండో డైరెక్టర్ పసుపుల నరసింహ, యువ నాయకుడు 16 వార్డు కౌన్సిలర్ నరసింహారావు, సింగిల్ విండో డైరెక్టర్ రఘుపతి రావు, పదో వార్డు కౌన్సిలర్ షేక్ రహీమ్ పాషా, 9వ వార్డు కౌన్సిలర్ నయిం, మాజీ సింగిల్విండో అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ చిన్న నిరంజన్ రావు,15వ వార్డు జూపల్లి ప్రధాన అనుచరుడు వంగ రాజశేఖర్ గౌడ్, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఎగ్బాల్, మాజీ ఎంపిటిసి వేణు గోపాల్ యాదవ్,కిషర్ యాదవ్,మేకల కిరణ్ యాదవ్, మాజీ సర్పంచ్ బచ్చలకూర బాలరాజు, మద్దెల రాందాసు, అవుట స్వామి, కళ్ళు శివ, కల్వరాల నరసింహ, ధర్మ తేజ, పసుల వెంకటేష్, వెంకటేష్ యాదవ్,బిజ్జ రమేష్,ముస్తక్,బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉద్యమం కోసం ఉద్యోగాన్ని ధరపోశా

Satyam NEWS

విమానాశ్రయంలో 18 ఏళ్లు: చివరికి మృతి

Satyam NEWS

పోల్ నిషా: ఫుల్లుగా తాగారు ఇక గుద్దుడే గుద్దుడు

Satyam NEWS

Leave a Comment