28.7 C
Hyderabad
April 27, 2024 03: 23 AM
Slider ప్రపంచం

విమానాశ్రయంలో 18 ఏళ్లు: చివరికి మృతి

#momin

ఎయిర్ పోర్టు టెర్మినల్ లో 18 సంవత్సరాలు నివసించిన ఒక వ్యక్తి మరణించాడు. ఎయిర్ పోర్టు టర్మినల్ లో నివసించే వ్యకి అనగానే… ఎయిర్ పోర్టులో నివసించడం ఏమిటి అని అనుకుంటున్నారా? నిజంగానే ఇతను ఎయిర్ పోర్టులో 18 ఏళ్లు గడిపాడు. పారిస్‌లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఆసక్తికరమైన ఇతని కథను అమెరికన్ ఫిల్మ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ 2004లో సినిమా గా కూడా తీశారు. ‘ది టెర్మినల్’ సినిమా ఈ వ్యక్తి కథ నుండి ప్రేరణ పొందిందే. మెర్హాన్ కరీమి నస్సేరి అనే ఈ వ్యక్తి, విమానాశ్రయంలోని టెర్మినల్ 2ఎఫ్‌లో మధ్యాహ్న సమయంలో గుండెపోటుతో మరణించాడని పారిస్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారి ఒకరు తెలిపారు. పోలీసులు, వైద్య బృందం అతనికి చికిత్స అందించారు.

అయితే అతను బతకలేదు. మెహ్రాన్‌ను సర్ ఆల్‌ఫ్రెడ్ అని కూడా పిలుస్తారు. ఫ్రెంచ్ మీడియా నివేదికల ప్రకారం, కరీమి నాస్సేరీ 1945లో ఇరాన్ నగరమైన మస్జిద్ సులేమాన్‌లో జన్మించాడు. అతను 1988 నుండి 2006 వరకు పారిస్ విమానాశ్రయం టెర్మినల్ 1 లో నివసించాడు. అతనికి రెసిడెన్సీ పత్రాలు లేకపోవడంతో అది చట్టపరమైన అడ్డంకిగా మారింది. బ్రిటన్ శరణార్థిగా రాజకీయ ఆశ్రయం ఇవ్వడానికి బ్రిటన్ నిరాకరించిన తర్వాత 1988లో మెహ్రాన్ విమానాశ్రయంలో అతను స్థిరపడాల్సి వచ్చింది.

అతని తల్లి స్కాటిష్ అయినప్పటికీ బ్రిటన్ అతనికి ఆశ్రయం నిరాకరించింది. అతను తనకు ఏమీ లేదని, ఉండటానికి ఆశ్రయం కూడా లేదని చెప్పాడు. అంతే కాకుండా విమానాశ్రయంలోనే ఉంటానని చెప్పాడు. దాంతో అతడిని అక్కడ ఉంచక తప్పలేదు. నిత్యం తన వస్తువులను తన వెంట తీసుకెళ్లేవాడు. మెహ్రాన్ 18 ఏళ్లపాటు విమానాశ్రయంలో ఉన్న తర్వాత తొలిసారిగా విమానాశ్రయం నుంచి బయటకు వచ్చింది ఆయన ఆరోగ్యం విషమించిన తర్వతే. విమానాశ్రయంలో అతను చదవడం, డైరీ రాయడం మరియు ఆర్థిక శాస్త్రం చదువుతూ గడిపాడు. చివరికి మరణించాడు.

Related posts

అందరూ తాగండి, తాగించండి ఆరోగ్య ద్రావకం నీరా

Satyam NEWS

దేశంలో కరోనా డేంజర్ జిల్లాలు ఆంధ్రాలోనే ఎక్కువ

Satyam NEWS

ఎన్ని సార్లు గుండె నొప్పి వస్తుది కోడెలా?

Satyam NEWS

Leave a Comment