39.2 C
Hyderabad
April 28, 2024 11: 44 AM
Slider వరంగల్

ఉద్యమం కోసం ఉద్యోగాన్ని ధరపోశా

తెలంగాణ మలి విడత ఉద్యమం కోసం తాను ఒక ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ అయి ఉండి కూడా తన ఉద్యోగాన్ని రాష్ట్ర ప్రజల, విద్యార్థుల భవిష్యత్తు కోసం కేసిఆర్ ఆదేశానుసారం రాజీనామా చేసి తన భవిష్యత్తును ఉద్యమానికి దారపోసానని ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోరిక పోమా నాయక్ అన్నారు. ములుగు నియోజక వర్గంలో తన లాంటి ఎంతో మంది ఉద్యమకారులను ములుగు నియోజక వర్గ ఇంచార్జీగా వ్యవహరిస్తున్న సతీష్ రెడ్డి అవమానిస్తున్నారని ఆ సంఘటన తనను ఎంతో కలిచి వేసిందని తాను ఏనాడు తన స్వలాభం కోసం బీఆర్ఎస్ పార్టీలో ఏది ఆశించ లేదన్నారు. గత 23 సంవత్సరాలుగా కేసిఆర్ వెంట నడుస్తూ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఒక క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తగా మసులుకున్నానన్నారు.

తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును నమ్మి మలి విడత తెలంగాణ ఉద్యమం కోసం తన జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఉద్యోగాన్ని సైతం రాజీనామా చేశానని ఆ నాడు తనకు ములుగు నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తానని టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసిఆర్ అప్పటి బిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు అయిన కోల జనార్ధన్, కట్టంగూరి సత్యనారాయణ రెడ్డిల ముందు తనకు మాట ఇచ్చారని, గత ఐదు సార్లు ప్రతి ఎన్నికల్లో తనకు హామీలు ఇవ్వడం అది మరిచి పోవడం పరిపాటిగా మారిందని ఆయన వాపోయారు. తాను ఏనాడు కూడా అధిష్టానం మాట జవదాటలేదని, తాను ఉద్యమంలో క్రీయాశీలకంగా వ్యవహరించిన రోజులలో కనీసం టిఆర్ఎస్ పార్టీలో లేని నాయకులు ఈ రోజు తనను అవమానించడం తనను ఎంతో భాదించిందన్నారు.

నేడో రేపో రెబల్ గా నామినేషన్ వేసి వచ్చే ఎన్నికలలో తన సత్తా ఎంటో చూపిస్తానన్నారు. నిజం చెప్పాలంటే ములుగు జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి ఆనాడు ఊపిర్లు ఊదింది తానని, ఈ రోజు ములుగు నియోజక వర్గ ఇంచార్జీలు, కార్పొరేషన్ చైర్మన్ లమని చెప్పుకుని తిరిగి నాయకులు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్నారు. కానీ ఉద్యమం కోసం తన తొమ్మిది సంవత్సరాల సర్వీసును కేసిఆర్ పిలుపుతో స్వచ్చందంగా వదులుకుని వచ్చిన తనకు టీఆర్ఎస్ పార్టీలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవ్వరు ఎన్ని కుయుక్తులు పన్నినా రానున్న ఎన్నికలలో తన సత్తా చాటడం ఖాయమని స్పష్టం చేశారు.

Related posts

వి ఎస్ యు లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

Satyam NEWS

పోలీసు బాస్ ఆధ్వర్యంలో జరిగిన “స్పందన”కు వచ్చిన బాధితులు ఎంతమందో తెలుసా….!

Bhavani

దినసరి కూలీలు, రైస్ మిల్లర్స్ యాజమాన్యం చర్చలు వాయిదా

Satyam NEWS

Leave a Comment