33.7 C
Hyderabad
April 29, 2024 01: 01 AM
Slider నెల్లూరు

వి ఎస్ యూనివర్సిటీ లో సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు

#nelloredist

నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో శ్రీపొట్టిశ్రీరాములు భవనంలో దేశ తొలి మహిళా ఉపాధ్యాయులు, సంఘ సంస్కర్త సావిత్రి భాయి పూలే జయంతి సందర్భంగా ఉపకులపతి ఆచార్య జి యం సుందర వల్లి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సుందర వల్లి మాట్లాడుతూ ఆధునిక భారత దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి తరం మహిళా ఉద్యమకారిణి సావిత్రి భాయిపూలే అని అన్నారు. ఆమె జయింతిని ప్రతి ఏటా జనవరి ౩న జాతీయ మహిళా టీచర్స్ దినోత్సవంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయ కృష్ణ రెడ్డి,  ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్, బోధన బోధనేతర సిబ్బంది విద్యార్ధిని, విద్యార్ధులు పాల్గొన్నారు.

Related posts

ఉత్త‌మ క్రీడాకారులుగా ఎద‌గాలి : జేసీ వెంక‌ట‌రావు

Satyam NEWS

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: పూరి

Satyam NEWS

సహాయ నిధికి విరివిగా విరాళాలు ఇవ్వండి

Satyam NEWS

Leave a Comment