26.7 C
Hyderabad
May 3, 2024 10: 10 AM
Slider ముఖ్యంశాలు

దోచుకుతింటున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

#kapaul

రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు ఇరు రాష్ఠ్రాలను దోచుకుతింటున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు విజయనగరం వచ్చిన ఆయన మీడియా తో మాట్లాడారు. విజయనగరం రావడం చాలా ఆనందంగా ఉందని త్వరలో గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ పెడతాను అని  నరేంద్రమోడీ అమిత్ షా, ల ని కోరడం జరిగిందని కే.ఏ.పాల్ అన్నారు.

అయితే మోడీ, అమిత్ షా పిలుపు మేరకు నేను ఢిల్లీ వెళుతున్నానని అందుకోసం వారం పాటు పాల్ రావాలి, పాలన మారాలి అనే యాత్ర కి విరామం ఇస్తున్నానన్నారు. దేశం లో వివిధ సమ్మిట్లు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 8 లక్షలు కోట్లు కి చేరుకొందని పాల్ లెక్కలు చూపించారు. మన దేశం శ్రీలంక లాగా ఐపోతుందని పాల్ అన్నారు. నాయ్య వ్యవస్థ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభావితం చేస్తుందోన్నారు. 2014, 19 ఎలక్షన్స్ లో మోడీ, చంద్రబాబు కి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేశానని గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రల్లో ఎక్కడ చూసిన భూములు, కొండలు ఇష్టానుసారంగా అమ్మేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ లో కె.సి.ఆర్. కుటుంబం మొత్తం తినేస్తున్నారని పాల్ ధ్వజమెత్తారు. తాను సమస్యలు మీద అనేక పోరాటాలు చేస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాశనం చేశాడని ఆరోపించారు.. పాల్. ఆయన అధికారం లో ఉన్నప్పుడు రాజధాని కూడా కట్టలేకపోయాడని విమర్శించారు. ఇప్పుడు జగన్  కూడా చంద్రబాబు బాటలోనే నడుస్తున్నారని విమర్శించారు. జగన్ కి అప్పులు ఇచ్చేవారు కూడా కనబడడం లేదు, ఇది దౌర్బగ్యం మని ఎద్దేవా చేశారు.

తెలంగాణ లో కె.సి.ఆర్ మీద అలుపెరుగని పోరాటం చేస్తున్నానన్నారు. అనేక రుజువులు అన్ని కలిపి సిబిఐ డైరెక్టర్ కి అందజేశానని స్పష్టం చేశారు. తెలంగాణ లో చేస్తున్న సర్వేల్లో కె.ఏ.పాల్ మాకు కావాలి.. రావాలి అని 75 శాతం ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

ఈ రోజున దేశం లో, రాష్ట్రంలో అభివృద్ధి చేద్దాం అంటే తనతో కలసి ఎవరు ముందుకు రావడం లేదని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

కరోనా పేషంట్లకు కడప పోలీసుల సహాయం

Satyam NEWS

(Natural) Green Spectrums Cbd Hemp Oil New Middletown Hemp Cbd Store Coming Hemp Bombs Cbd Capsules 2000mg

Bhavani

ప్రమాదకరంగా ముందుకు వస్తున్న దుష్ట చైనా

Satyam NEWS

Leave a Comment