40.2 C
Hyderabad
April 26, 2024 14: 56 PM
Slider ప్రత్యేకం

ఆరెల్లి మల్లేష్ మాదిగను పరామర్శించిన మందకృష్ణ మాదిగ

#mandakrishnamadiga

ఈనెల 3న బిజెపి బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతున్న సందర్భంలో నిరసన వ్యక్తం చేసి బిజెపి కార్యకర్తల దాడిలో గాయపడిన ఎమ్మార్పీఎస్ ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ ఆరెల్లి మల్లేష్ మాదిగను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పరామర్శించారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆరెల్లి మల్లేష్ మాదిగ నివాసానికి నేడు ఆయన వచ్చారు. ఎస్సీ వర్గీకరణ పై ప్రధానమంత్రి స్పష్టమైన వైఖరి వెల్లడించాలని ఆరెల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. ఇదే ఆయన చేసిన తప్పుగా బిజెపి కార్యకర్తలు భావించారు.

ఎస్సీ వర్గీకరణ కోసం 28 సంవత్సరాల నుండి బిజెపి పార్టీ కట్టుబడి ఉందని మాయ మాటలు చెప్పి అనేక సందర్భాలలో మాదిగలు నిర్వహించుకునే ప్రతి సభలో మద్దతు పలికి చివరకు నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని ఆయన అన్నాడు. బిజెపి అగ్రనాయకత్వం వర్గీకరణకు మద్దతుగా గత ప్రభుత్వాలకు లేఖలు రాసింది.

ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టింది. కేంద్రంలో బిజెపి పార్లమెంటులో సంపూర్ణ మెజార్టీ కలిగి అనేక బిల్లులు తెచ్చుకొని  ఆమోదం చేసుకొని నెగ్గిచ్చుకున్నారు. మరి 28 సంవత్సరాలుగా మాదిగలకు వెన్నుదన్నుగా ఉండి చివరకు మాదిగలు న్యాయమైన వర్గీకరణ డిమాండ్ ను పరిష్కరించడం లేదని ఒక్కసారి నిరసన తెలిపితేనే ఎమ్మార్పీఎస్ శ్రేణులపై బిజెపి కార్యకర్తలు గూండాల్లా రౌడీల్లా దాడికి దిగడం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు.

తెలంగాణలో బిజెపి ఆటలు సాగకుండా  మాదిగలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరించారు. భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా 15 రోజులపాటు గ్రామ మండల జిల్లా కేంద్రాలలో బిజెపి పై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని ఎమ్మార్పీఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కో  కన్వీనర్లు బారుకుంట సుభాష్, సూర్యకాంత్  ఎంఎస్ఎఫ్ కో కన్వీనర్ గోటుముక్కల సుభాష్, శ్రీకాంత్ , లక్ష్మణ్, కోడిచెర్ల  శివ, స్వామి ప్రశాంత్ బొల్లారం నందకిషోర్ రాజకుమార్ రవి మల్యాల సాయి కృష్ణ MSP నాయకులు కూడల స్వామి కామ్ల బాలాజీ సిరిసిల్ల భూమయ్య దుబ్బాక సుభాష్ గజ్జల శంకర్ అరికిల్లా అశోక్ బిరుదుల లాజర్ రవి సాయ రావు పోశెట్టి రాజు ఎమ్మార్పీఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

‘త‌లైవి’లో అర‌వింద్ స్వామి న్యూ లుక్ కు నీరాజ‌నం

Satyam NEWS

ఉద్యమిద్దాం.. కేసీఆర్ ను గద్దె దించుదాం

Satyam NEWS

మద్యపాన నిషేధం దిశగా మరో అడుగు ముందుకు వేసిన ఏపి

Satyam NEWS

Leave a Comment