31.2 C
Hyderabad
May 3, 2024 02: 07 AM
Slider కడప

కేంద్ర మంత్రులతో కడప ఎంపి అవినాష్ రెడ్డి భేటీ

#MP Avinash Reddy

కడప – బెంగళూరు మధ్య మార్పు చేసిన కొత్త అలైన్మెంట్ ను తొందరగా అప్రూవ్ చేయాలని కడప ఎంపి వైయస్ అవినాష్ రెడ్డి ఢిల్లీ లో గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ను కలిసి కోరారు. గతంలో2021 జూన్ మాసం లో ఈ సమస్యను ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ద్వారా రైల్వే బోర్డు చైర్మన్ త్రిపాటి దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం సిఫార్సు చేసిన ఆ కాఫీ ని కూడా ఈ వినతికి జత చేసినట్లు ఎంపీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

గతంలో ఉన్న ఒరిజినల్ అలైన్మెంట్ ఎక్కువ దూరం, రెండు రాష్ట్రాల మధ్య భూసేకరణ సమస్యకు ఎక్కువ కాలం పడుతుందని, మార్పు చేసిన ఈ కొత్త లైన్ ద్వారా తక్కువ దూరం తక్కువ ఖర్చుతో పూర్తి చేయవచ్చని దీన్ని త్వరగా ఆమోదించాలని కేంద్ర మంత్రిని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక, పర్యాటక మంత్రి G. కిషన్ రెడ్డి ని ఢిల్లీలో కలసి గండికోట చారిత్రక ప్రాముఖ్యతను వివరిస్తూ, గండికోటను టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దెందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్యర్యంలో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.

ఈ సందర్బంగా మంత్రి కిషన్ రెడ్ది స్పందిస్తూ “స్వదేశీ దర్శన్” అనే పథకం ద్వారా 70 – 80 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే దాల్మియా సిమెంట్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి CSR ద్వారా మరి కొంత నిధులు దీనికే కేటాయిస్తామని అని పేర్కొన్నారు.

అలాగే మంత్రి కి సిద్దవటం కోట చారిత్రక ప్రాముఖ్యతను తన లేఖ ద్యారా వివరిస్తూ, ఇటీవల భారీ వర్షాల సమయంలో సిద్దవటం కోటలోని పురాతన స్మారక చిహ్నాలు మరియు ప్రహరీ గోడలు చాల వరకు దెబ్బతిన్నాయని తెలియచేస్తూ, పురాతన స్మారక చిహ్నాల పరిరక్షణ కోసం ,ప్రహరీ గోడల పునరుద్దరణ కొరకు తక్షణం చర్యలు తీసుకోవాలని, తద్వారా సిద్దవటం కోట యొక్క చారిత్రక ప్రాముఖ్యతను, భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకు సహకరించవలసినదిగా కోరారు.

Related posts

వనపర్తి జిల్లా కేంద్రంలో జర్నలిస్టు భవన్ నిర్మాణం

Satyam NEWS

అన్ని వ‌ర్గాల మేలే బీజేపీ ల‌క్ష్యం

Sub Editor

పొంగి పొర్లుతున్న డ్రైనేజి నీళ్లు

Satyam NEWS

Leave a Comment